నేను సూటవ్వనని కుక్కతో షూటింగ్ చేశారు
హీరోయిన్ గా మారకముందు శోభిత ఎన్నో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.;

సినీ ఇండస్ట్రీలోకి ఎవరికీ అవకాశాలు, సక్సెస్ ఊరికే రావు. ఏదో బీభత్సమైన అదృష్టం ఉంటే తప్ప. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని చెప్తోంది అక్కినేని కొత్త కోడలు శోభిత ధూళిపాళ. తెలుగమ్మాయి అయినప్పటికీ శోభితకు టాలీవుడ్ లో కంటే బాలీవుడ్ లోనే ఎక్కువ గుర్తింపు ఉంది.
హీరోయిన్ గా మారకముందు శోభిత ఎన్నో చేదు అనుభవాల్ని ఎదుర్కొన్నట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. హీరోయిన్ అవకముందు తనకు ఓ ఆఫర్ వచ్చిందని, అది కూడా రాత్రి 11.30 గంటల టైమ్ లో ఫోన్ చేసి ఆడిషన్ కు రమ్మన్నారట. విచిత్రంగా ఈ టైమ్ లో ఫోన్ చేశారేంటి అనుకున్నానని చెప్పిన శోభిత వాళ్లు పిలిచినట్టే ఆడిషన్ కు వెళ్లిందట.
ఆడిషన్ అయిపోయాక తనను సెలెక్ట్ చేశామని చెప్పి యాడ్ షూట్ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారని, వాళ్లు చెప్పింది ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్ కాకపోయినా గోవా అనగానే ఎగ్జైట్ అయ్యానని, గోవా వెళ్లాక ఫస్ట్ డే షూటింగ్ వరకు అంతా బాగానే జరిగింది తర్వాత కెమెరాలో ఏదో సమస్య ఉండటంతో మిగిలిన షూట్ తర్వాత చేద్దామని చెప్పారని శోభిత తెలిపింది.
ఆ తర్వాత రోజు తాను సెట్స్ కు వెళ్లేసరికి ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్ కు సరిపోదని అక్కడ ఉన్నోళ్లంతా మాట్లాడుకుంటున్నారని చెప్పిన శోభిత తాను కాన్ఫిడెంట్ గా కనిపించడం వల్లే వాళ్ల బ్రాండ్ కు సూటవ్వనని తనను సైడ్ చేశారని, తన ప్లేస్ లో ఓ కుక్క ను తీసుకున్నారని శోభిత చెప్పింది. శోభిత ఈ విషయం చెప్పగానే అందరూ షాకయ్యారు.
శోభితను సెలెక్ట్ చేసుకున్న వాళ్లు ఆ యాడ్ ను అసలు కుక్కతో ఎలా చేశారని అందరూ షాకవుతుండగా, ఇంతకీ శోభిత మిస్ అయిన ఆ యాడ్ ఏంటని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఆ యాడ్ పూర్తి చేయకపోయినా ఒకరోజు వర్క్ చేసినందుకు సదరు యాడ్ కంపెనీ వాళ్లు తన డబ్బు తనకు ఇచ్చారని శోభిత చెప్పుకొచ్చింది.