పిక్‌టాక్ : టాలీవుడ్ కింగ్‌తో ట్యాలెంటెడ్ స్టార్
కుబేరా కాకుండా నాగార్జున మరో వైపు కోలీవుడ్‌లో 'కూలీ' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.;

టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈమధ్య కాలంలో సినిమాల విషయంలో అభిమానులను తీవ్రంగా నిరాశ పరుస్తూ వస్తున్నాడు. గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. నాగార్జున నటించిన 'కుబేరా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా రూపొందిన కుబేరా సినిమాలో నాగార్జున పాత్ర గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. త్వరలోనే సినిమా విడుదల కాబోతున్నట్లు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. కుబేరా కాకుండా నాగార్జున మరో వైపు కోలీవుడ్‌లో 'కూలీ' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో రజనీకాంత్‌తో పాటు పలువురు స్టార్స్ నటించారు. ముఖ్యంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సైతం ఈ సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమాలో ట్యాలెంటెడ్ మలయాళ స్టార్ నటుడు సౌబిన్ షాహిర్ సైతం కీలక పాత్రలో నటించాడు. సినిమాను భారీ స్టార్ కాస్ట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందించిన లోకేష్ కనగరాజ్ కూలీ స్థాయిని అమాంతం పెంచాడు.
వెండి తెరపై ఈ భారీ స్టార్ కాస్ట్‌ను ఎప్పుడు చూస్తామా అంటూ రజనీకాంత్ ఫ్యాన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వెండి తెరపై కలిపి చూస్తామో లేదో తెలియదు కానీ నాగార్జున, సౌబిన్ షాహిర్ లు కలిసి సోషల్ మీడియాలో సింగిల్ ఫ్రేమ్‌లో కన్నుల విందు చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్యాలెంటెడ్ నటుడితో కలిసి వర్క్ చేసిన నాగార్జున ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దర్శకుడిగానూ విమర్శకుల ప్రశంసలు పొందిన సౌబిన్ షాహిర్ తో నాగార్జున ఒక సినిమా చేస్తే బాగుంటుంది అని కొందరు అంటున్నారు.
గత ఏడాది మంజుమ్మెల్ బాయ్స్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ఈమధ్య కాలంలో పలు ఓటీటీలు మలయాళ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నాయి. దాంతో సౌబిన్ షాహిర్ కి తెలుగులో మంచి గుర్తింపు లభించింది. ముందు ముందు తెలుగులో ఇతడు సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునకు నచ్చితే తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లోనే సౌబిన్ షాహిర్ తో సినిమాను చేసేందుకు సిద్ధం అవుతాడని కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ అరుదైన క్లిక్ కి సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. కూలీ సినిమా పై అంచనాలు, ఆసక్తి మరింతగా ఈ పిక్ పెంచింది.