రాబిన్ హుడ్ స్ట్రాంగ్ బిజినెస్.. టార్గెట్ ఇదే!

సమ్మర్ లో మంచి కంటెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి ఇది కచ్చితంగా ఓ వెరైటీ ఎంటర్టైనర్ అనిపించేలా ఉంది.;

Update: 2025-03-26 16:09 GMT
రాబిన్ హుడ్ స్ట్రాంగ్ బిజినెస్.. టార్గెట్ ఇదే!

యూత్ స్టార్ నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్‌లో వస్తున్న “రాబిన్ హుడ్” సినిమాపై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బజ్ ఏర్పడింది. ఫన్, యాక్షన్ మిక్స్ అయిన స్టైల్ ప్రోమోషన్లతో మూవీ టీమ్ ఎట్రాక్షన్ తీసుకొచ్చింది. పాటలు, వీడియో క్లిప్స్, మాస్ టీజర్ ఇలా ఒక్కొక్కదాన్ని వరుసగా రిలీజ్ చేస్తూ క్యాంపెయిన్‌ను మళ్ళీ తిప్పేసింది. సమ్మర్ లో మంచి కంటెంట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఆడియన్స్‌కి ఇది కచ్చితంగా ఓ వెరైటీ ఎంటర్టైనర్ అనిపించేలా ఉంది.

టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఆస్ట్రేలియన్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేయడం సినిమాకి అదనపు ప్లస్. వార్నర్ ప్రెజెన్స్‌ను ప్రొమోషనల్ గా చక్కగా వాడుకుంటూ మాస్, క్లాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఈ కారణంగా సినిమా మీద క్రేజ్ మళ్లీ పెరిగింది. ముఖ్యంగా కామెడీ పంచ్‌లు, విజువల్ స్కేల్ కూడా ఆకట్టుకుంటున్నాయి.

ఇలాంటి హైప్ నేపథ్యంలో రాబిన్ హుడ్ సినిమాకు బిజినెస్ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. మైత్రి మూవీ మేకర్స్ భారీగా సినిమాను నిర్మించడమే కాకుండా, అన్ని ఏరియాల్లోనూ టాప్ డిస్ట్రిబ్యూషన్ ఆఫర్లు అందుకున్నట్టు సమాచారం. ఇది నితిన్ సినిమాకి ఓ కొత్త స్థాయిని తీసుకువచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సౌత్‌తో పాటు ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమా కోసం డీల్స్ బాగున్నాయని సమాచారం.

నితిన్ గత కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా… వెంకీ కుడుములతో ‘భీష్మ’ లాంటి హిట్ తర్వాత ఈ కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. క్రేజీ కాంబినేషన్, మైత్రి బ్యానర్ మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్స్ ముందుకొచ్చారు.

రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్

నైజాం – రూ. 9.50 కోట్లు

సీడెడ్ – రూ. 3 కోట్లు

ఆంధ్ర – రూ. 10.50 కోట్లు

AP-TG మొత్తం – రూ. 23 కోట్లు

కర్ణాటక + ఇతర రాష్ట్రాలు + ఓవర్సీస్ – రూ. 4.50 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ – రూ. 27.50 కోట్లు

ఈ బిజినెస్ ను బ్రేక్ ఈవెన్ చేయాలంటే సినిమా కనీసం రూ. 28 కోట్ల షేర్‌ను సాధించాల్సి ఉంటుంది. మంచి టాక్ వస్తే ఈ టార్గెట్ అందుకోవడం కష్టం కాదు. తొలి వీకెండ్ కలెక్షన్స్‌తోనే రాబిన్ హుడ్ సక్సెస్ దిశగా దూసుకుపోయే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక మంచి బాక్సాఫీస్ హిట్ కోసం చూస్తున్న నితిన్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News