'సూపర్‌స్టార్‌ స్క్వేర్‌' కమింగ్ సూన్‌..!

కూలీ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా రజనీకాంత్‌ తదుపరి సినిమా 'జైలర్‌ 2' ఉండబోతుంది.;

Update: 2025-03-26 21:30 GMT
Jailer 2 builds for the superstar sequel

కోలీవుడ్‌ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇటీవలే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ' సినిమాను రజనీకాంత్‌ పూర్తి చేసిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన కూలీ సినిమాను ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కూలీ సినిమాలో రజనీకాంత్‌ మాత్రమే కాకుండా టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర, మలయాళ స్టార్‌ నటుడు సౌబిన్ షాహిర్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కూలీ సినిమా స్టార్‌ కాస్టింగ్‌ భారీగా ఉండటంతో అంచనాలు అదే స్థాయిలో ఉన్నాయి. కూలీ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా రజనీకాంత్‌ తదుపరి సినిమా 'జైలర్‌ 2' ఉండబోతుంది.

నెల్సన్‌ దిలీప్ దర్శకత్వంలో రూపొందిన జైలర్‌ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. రజనీకాంత్‌ కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో వచ్చిన జైలర్‌ సినిమా అత్యధిక వసూళ్లు నమోదు చేసి రికార్డ్‌ ని నమోదు చేసిన విషయం తెల్సిందే. రజనీకాంత్‌కి జైలర్‌ సినిమా కచ్చితంగా మరో అయిదు సంవత్సరాల వరకు వరుస సినిమాలు చేసే విధంగా బూస్ట్‌ను ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. జైలర్‌ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్‌ను చేయాలని నెల్సన్ దిలీప్‌ అప్పుడే నిర్ణయించుకున్నాడు. దాదాపు ఏడాది పాటు వర్క్ చేసి చివరకు సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు. ఇటీవలే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయింది.

రజనీకాంత్‌ జైలర్‌ సినిమాలో మరో సూపర్‌ స్టార్ నటించే అవకాశాలు ఉన్నాయి. మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ జైలర్ 2 లో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోహన్‌ లాల్‌ హీరోగా నటించిన ఎల్‌ 2 సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ నేపథ్యంలో మీడియా సమావేశంలో మోహన్‌ లాల్‌ పాల్గొన్నారు. ఆ సమయంలోనే తాను ఎల్‌ 2 సినిమాతో బిజీగా ఉన్న సమయంలో కోలీవుడ్‌ నుంచి చాలా సినిమాలు వచ్చాయి. వాటికి నేను ఒప్పుకోలేక పోయాను. ఎల్‌ 2 సినిమాను ముగించిన నేపథ్యంలో త్వరలోనే తమిళ్‌ సినిమాల్లో నటిస్తాను అన్నాడు. అంతే కాకుండా జైలర్ 2 సినిమా కోసం తనను సంప్రదించారని కూడా మోహన్‌ లాల్‌ చెప్పుకొచ్చాడు.

జైలర్‌ 2 మేకర్స్‌ పిలిస్తే తప్పకుండా ఆ సినిమాలో నటించేందుకు సిద్ధం అంటూ మోహన్ లాల్‌ ఓపెన్‌గా ప్రకటించాడు. దాంతో నెల్సన్‌ దిలీప్‌ కచ్చితంగా మోహన్‌ లాల్‌ను సంప్రదించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాలో మరో సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ నటిస్తే ఏ రేంజ్‌లో క్రేజ్ ఉంటుందో, ఏ స్థాయిలో సినిమాకు బజ్‌ క్రియేట్‌ అవుతుందో ఊహకు సైతం అందడం లేదు.

ఇలాంటి ఒక క్రేజీ ప్రాజెక్ట్‌ను నెల్సన్ దిలీప్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తే కచ్చితంగా ఆయన జన్మ ధన్యం అంటూ సినీ ప్రేమికులు అంటున్నారు. ఈ సూపర్‌ స్టార్‌ స్క్వేర్‌ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జైలర్‌లో రజనీకాంత్‌తో పాటు కన్నడ సూపర్‌ స్టార్‌ శివ రాజ్‌ కుమార్‌ నటించిన విషయం తెల్సిందే. కనుక సూపర్‌ స్టార్‌ స్క్వేర్‌ రిపీట్‌ అయితే జైలర్‌ 2 కూడా సెన్షేషనల్‌ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం.

Tags:    

Similar News