పిక్‌టాక్ : క్యూట్ ఈషా బుంగమూతి పెట్టుకుంటే..!
హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను సినిమాలు చేయడం ద్వారా ఈషా రెబ్బకి మంచి గుర్తింపు దక్కింది.;

టాలీవుడ్‌లో ఉత్తరాది ముద్దుగుమ్మలు, మలయాళి కుట్టీలు రాజ్యం ఏళుతున్న సమయంలో తెలుగు అమ్మాయిలకు కనీసం అవకాశాలు దక్కడం లేదు. ఇలాంటి సమయంలో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ. వరంగల్‌లో పుట్టిన ఈమె వరంగల్‌లో పెరిగింది. ఎంబీఏ పట్టా పొందిన ఈషా సినిమాలపై ఆసక్తితో మోడలింగ్ చేసింది. దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా కోసం ఆడిషన్ ఇచ్చింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఈషా రెబ్బా అప్పటి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే వచ్చింది. హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను సినిమాలు చేయడం ద్వారా ఈషా రెబ్బకి మంచి గుర్తింపు దక్కింది.

2013లో అంతకు ముందు ఆ తర్వాత, 2015లో బందిపోటు, 2017 అమితుమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించింది. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు రానప్పటికీ చిన్న హీరోల సినిమాల్లో, చిన్న బడ్జెట్ సినిమాల్లో ఈమెకు హీరోయిన్‌గా అవకాశాలు దక్కాయి. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈషా రెబ్బ పేరు నార్త్ అమ్మాయి అనే ఫీల్‌ను కలిగిస్తుందని కొందరు అంటారు. అందుకే టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది అనేది కొందరి మాట. ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.
చిన్న సినిమాల్లో నటించినప్పటికీ 2.5 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో సొంతం చేసుకున్న ఈ అమ్మడు తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, బుంగ మూతి పెట్టుకుని, లూజ్ హెయిర్ స్టైల్‌తో పక్కింటి అమ్మాయి, భలే అందంగా ఉందే అనే ఫీల్‌ను కలిగిస్తుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉండే ఈషా రెబ్బ మరోసారి తన అందమైన లుక్‌తో ఆకట్టుకుంది. ఈసారి వైట్ డ్రెస్‌లో ఈషా రెబ్బ మరింత అందంగా కనిపిస్తుందని, నార్త్ అమ్మాయిలకు ఏమాత్రం తగ్గకుండా, మలయాళి ముద్దుగుమ్మలను మించి ఈషా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మామా మశ్చీంద్ర సినిమా తర్వాత ఈషా రెబ్బ తెలుగులో ఈ అమ్మడు ఎక్కువ సినిమా ఆఫర్లకు ఓకే చెప్పడం లేదు. కొన్ని చిన్న సినిమాల్లో ఆఫర్లు వచ్చినా పెద్దగా పట్టించుకోవడం లేదు. వెబ్ సిరీస్‌ల్లోనూ ఈమె నటించడం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. తెలుగులో ఈమె ముందు ముందు మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈమె అందానికి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు రావాలని, కానీ ఈమెకు అదృష్టం కలిసి రావడం లేదని, తెలుగు అమ్మాయి అనే ఒక ట్యాగ్ కారణంగా ఈమెకు ఆఫర్లు రావడం లేదని కొందరు అంటున్నారు. ఈషా తమిళ్‌లో ట్రై చేస్తే కచ్చితంగా పెద్ద ఆఫర్లు వస్తాయనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు.