L2 వాళ్లకి ఎక్కితే మాత్రం..!

ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఎల్ 2 ఎంపురాన్ అనే సినిమా చేశారు పృధ్విరాజ్ సుకుమారన్.;

Update: 2025-03-26 17:30 GMT
Prithviraj L2 gears up for grand release in telugu

ఓ పక్క సినిమాల్లో నటిస్తూ డైరెక్ట్ చేయడం అంటే చెప్పుకునేంత ఈజీ ఐతే కాదు. మలయాళ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్న పృధ్విరాజ్ సుకుమారన్ తన డైరెక్షన్ లో క్రేజీ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా లూసిఫర్ తో ఆయన సృష్టించిన సంచలనాలు తెలిసిందే. సినిమా మళయాలంలో సూపర్ హిట్ కాగా ఓటీటీలో అన్ని భాషల్లో అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఎల్ 2 ఎంపురాన్ అనే సినిమా చేశారు పృధ్విరాజ్ సుకుమారన్.

లూసిఫర్ కాంబినేషన్ అనగానే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. L 2 ఎంపురాన్ సినిమా కూడా లూసిఫర్ తరహాలోనే భారీ యాక్షన్ మూవీగా రాబోతుంది. ఈసారి పృధ్విరాజ్ మరింత స్టైలిష్ గా సినిమాను తీసినట్టు అనిపిస్తుంది. ఐతే మళయాలంతో పాటుగా మిగతా సౌత్ భాషల్లో కూడా L 2 ఎంపురాన్ రిలీజ్ చేస్తున్నారు.

ముఖ్యంగా తెలుగులో L 2 ఎంపురాన్ సినిమాను బాగా ప్రమోట్ చేస్తూ ఇక్కడ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని చూస్తున్నారు. లూసిఫర్ సినిమాను తెలుగు ఆడియన్స్ ఓటీటీలో బాగా చూశారు. అది చూసే ఆ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రీమేక్ చేశారు. లూసిఫర్ కు తెలుగు ఆడియన్స్ లో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇప్పుడు దానికి సీక్వెల్ గా వస్తున్న L 2 ఎంపురాన్ మీద తెలుగులో మంచి బజ్ ఉంది.

లూసిఫర్ ఫ్యాన్స్ కి ఆ సినిమా రేంజ్ లో L 2 ఎంపురాన్ ఎక్కితే మాత్రం ఈసారి థియేట్రికల్ వెర్షన్ లోనే తెలుగులో ఎల్ 2 సినిమాకు కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంటుంది. టీజర్, ట్రైలర్ చూస్తే అది జరిగే ఛాన్స్ ఉన్నట్టే అనిపిస్తుంది. ఈ వీకెండ్ లో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో రెండు డబ్బింగ్ సినిమాలు కాగా రెండు తెలుగు సినిమాలు.

డబ్బింగ్ సినిమాల్లో L 2 మీద మంచి బజ్ ఉంది. దిల్ రాజు సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సినిమా మీద నమ్మకం కుదిరేలా ఉంది. లూసిఫర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా కనెక్ట్ అయితే మాత్రం ఎల్ 2 కి తెలుగులో కూడా మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. పృధ్విరాజ్ మోహన్ లాల్ కూడ ఆ కాన్ఫిడెన్స్ తోనే తెలుగు ప్రమోషన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. మరి సినిమా రిజల్ట్ ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News