సీనియర్ హీరోలందరూ విలన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతున్న రోజులివి. ఆల్రెడీ జగపతి బాబు హీరో వేషాలకు స్వస్తి చెప్పేసి విలన్ గా మారిపోయి తన కెరీర్ ను మలుపు తిప్పుకున్నాడు. అతణ్ని చూసి మిగతా సీనియర్లు కూడా వైవిధ్యమైన పాత్రల మీద దృష్టిపెడుతున్నారు. ఈ కోవలోనే రాజశేఖర్ సైతం ఈ మధ్యే విలన్ పాత్రకు అంగీకరించినట్లు సమాచారం రావడం తెలిసిందే. సెన్సేషనల్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో రాజశేఖర్ ‘అహం’ అనే సినిమా చేస్తాడని.. ఉగాదికి ఆ సినిమా సెట్స్ మీదికి వెళ్తుందని ఇంతకుముందు వార్తలొచ్చాయి. ఐతే ఈ సినిమా నుంచి రాజశేఖర్ తప్పుకున్నట్లు తాజా సమాచారం.
కారణాలేంటో తెలియదు కానీ.. అహంలో రాజశేఖర్ నటించట్లేదని తెలుస్తోంది. ఆయన చేయాల్సిన పాత్రకు మరో సీనియర్ నటుడిని సంప్రదిస్తున్నారట. ఉగాది రోజే ఆ నటుడెవరన్నది బయటికి వస్తుంది. పారితోషకం విషయంలో రాజశేఖర్ అతిగా ఆశించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా గొప్ప మలుపు తీసుకుంటుందనుకున్న రాజశేఖర్ కెరీర్ కు ఇలా బ్రేక్ పడటం అనూహ్యమే. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ‘అహం’లో నవదీప్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పుష్కర కాలం నుంచి హిట్టు ముఖం ఎరుగని తేజ.. ఈ సినిమాతో అయినా సక్సెస్ సాధించాలని చూస్తున్నాడు.