తేజ కోసం విలన్‌ గా మారిపోయాడా?

Update: 2015-10-20 14:36 GMT
చాలామంది హీరోల సంగతి తెలియదు కాని.. మొన్నటివరకు ఫాం లో ఉన్న కొందరు సీనియర్లు మాత్రం తమ పప్పులు  ఉడకవని తెలుసుకున్నారు. ఈ విషయాన్ని జగపతి బాబు అయితే చాలా ఓపెన్‌ గానే చెప్పేశాడు. అందుకే వెంటనే ఆయనకు విలన్‌ గా చాలా రోల్సు కూడా వచ్చేశాయి. అయితే ఇదే బాటలో ఎంతమంది సీనియర్‌ హీరోలు పయనించనున్నారు?

చిరంజీవి 150వ సినిమాలో విలన్‌ రోల్‌ ఇస్తే తప్పకుండా చేస్తా అంటూ అప్పట్లో చెప్పుకొచ్చాడు సీనియర్‌ స్టార్‌ రాజశేఖర్‌. అయితే గెడ్డం గ్యాంగ్‌ సినిమాలో ప్రూవ్‌ చేసుకున్నాకే మనోడు విలన్‌ రోల్సు వైపు వెళతానని చెప్పాడు కూడా. కాని ఆ సినిమా అట్టర్‌ ఫ్లాపాయే.. మరి ఇప్పుడు ఏంటి? మ్యాటర్‌ ఏంటంటే.. దర్శకుడు తేజ హోరా హోరీ ఫ్లాపు తరువాత కొత్త వాళ్లతో సినిమాను తీస్తా అన్నాడు. ఈ ప్రాజెక్టులో మెయిన్ రోల్‌ విలన్‌ దే. ఆ రోల్ కోసం ఇప్పుడు రాజశేఖర్‌ ను ఎప్రోచ్‌ అయితే వెంటనే ఒకో చెప్పాశాడట.

కాని రాజశేఖర్‌ క్యాంపు మాత్రం ఈ విషయాన్ని ఇంకోలా చెబుతున్నారు. త్వరలోనే తేజ డైరక్షన్‌ లో రాజశేఖర్‌ హీరోగా ఓ సినిమా వస్తుందని అంటున్నారు. ఏదేమైనా.. అసలే తేజ.. ఇతగాడేమో రాజశేఖర్‌.. ఇద్దరూ యాంగ్రీ స్పెషలిస్టులు.. సో.. కలసి ప్రాజెక్టులు అంటే కాస్త కఠినంగానే అనిపిస్తోంది మరి. చూద్దాం ఏమవుతుందో!!
Tags:    

Similar News