హీరో రాజశేఖర్ నటించిన `కల్కి` ఫలితం నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఎంతో అంచనా వేస్తే.. ఆశించిన ఫలితాన్నివ్వలేదు. `గరుడ వేగ` తర్వాత మరో సక్సెస్ దక్కుతుందని భావిస్తే అంచనా తారుమారు అయ్యింది. మళ్లీ ఇదే సన్నివేశం రిపీటైతే ఈ సీనియర్ హీరో మార్కెట్ పై ఆ ప్రభావం పడక తప్పదు. అందుకే స్క్రిప్టుల విషయంలో రాజశేఖర్ ఆచి తూచి అడుగులేస్తున్నారట.
ప్రస్తుతం ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్న ఆయన ఈ సినిమాతో హిట్టు కొట్టి తిరిగి బాక్సాఫీస్ రేసులో వెలగాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతోంది. ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వస్తూనే కార్ ప్రమాదానికి గురై వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
ఇక సెట్స్ పై బిజీగా ఉంటూనే రాజశేఖర్ వేరొక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. తాజా ఎంపిక ఓ సెన్షేషనల్ పాయింట్ ను టచ్ చేసేదిగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విచారణలో ఉన్న కేసుకు సంబంధించిన కథాంశమిది. ఇటీవల కేసీఆర్ ప్రభుత్వాన్నే ఆ కేసు ఓ కుదుపు కుదిపేసింది. రాష్ట్ర వ్యాప్తంగానూ ఎంతో సంచలనమైంది. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది ఈ కేసుతోనే. సాక్ష్యాత్తు సిఎం దిగి వచ్చి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది దీంతో. ఈ వివాదాస్పద పాయింట్ నే రాజశేఖర్ టచ్ చేయబోతున్నారట.
తెలంగాణ ఇంటర్ బోర్డు రిలీజ్ చేసిన ఫలితాల్లో తప్పులు దొర్లిన కారణంగా మెరిట్ విద్యార్ధులంతా మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నారు. బోర్డు చేసిన తప్పుడు పని కారణంగా అమాయక విద్యార్ధులు తనువు చాలించడం కలకలం రేపింది. దీంతో ప్రభుత్వం పై పెద్ద ఎత్తున పేరెంట్ తో పాటుగా ప్రతి పక్షాలు విరుచుకుపడ్డాయి. అధికారులు చేసిన తప్పులకు పిల్లలు చనిపోవాలా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అదే సంఘటన మీ కుటుంబాల్లో జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? అని ఆవేదన చెందారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఓ కమిటీ వేసి విచారిస్తున్నారు. విద్యార్ధుల తరుపున ఓ లాయర్ వాదిస్తున్నారు. ఈ అంశాలనే రాజశేఖర్ కోసం కథగా మలిచారట. `ఆంధ్రా పోరి` ఫేం రాజ్ మదిరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఇందులో రాజశేఖర్ లాయర్ పాత్రను పోషిస్తున్నారట. సొంత బ్యానర్ లోనే రాజశేఖర్- రాజ్ మాదిరాజ్ ద్వయం ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది.