3 వారాల అమెరికా ట్రిప్ ముగించి చెన్నైకి ర‌జ‌నీ!

Update: 2021-07-09 06:30 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం ఎక్క‌డ ఉన్నారు?  అన్నాథే షూటింగ్ పూర్త‌యిందా? ఆయ‌న ప్ర‌స్తుతం ఏం చేస్తున్నారు? చ‌డీచ‌ప్పుడేమీ లేదేమిటి? అంటూ అభిమానుల్లో ఇటీవ‌ల ఆసక్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

అయితే అన్ని సందేహాల‌కు చెక్ పెడుతూ ఆయ‌న అమెరికాలో దాదాపు 3 వారాలు గడిపిన తరువాత శుక్రవారం ఉదయం చెన్నైకి తిరిగి వచ్చారు. వందలాది మంది అభిమానులు చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అభిమాన తలైవర్ కోసం కోసం క్యూలో నిలబడిన ఫోటోలు తాజాగా వైర‌ల్ గా మారాయి.

రజని విమానాశ్రయం నుండి బయలుదేరినప్పుడు అభిమానులు  సిబ్బంది అందరికీ తనదైన‌ ట్రేడ్ మార్క్ నమస్కారం చేసాడు. ర‌జ‌నీ  అతని భార్య లతా జూన్ 19న ప్రసిద్ధ మాయో క్లినిక్ లో ఆరోగ్య పరీక్ష కోసం అమెరికా వెళ్లారు. రజినీ ఇక్క‌డికి రాగానే త‌దుప‌రి పెద్ద కుమార్తె ఐశ్వర్య ధనుష్ తన భర్త ధనుష్ తో కలిసి రస్సో బ్రదర్స్ నెట్ ఫ్లిక్స్ చిత్రం `ది గ్రే మ్యాన్` చిత్రీకరణలో పాల్గొన్నార‌ని తెలుస్తోంది.

రజనీ న‌టిస్తున్న‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `అన్నాథే` దీపావళి కానుక‌గా నవంబర్ 4 న విడుదల కానుంది. అత‌డు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి త్వరలో ఒక ప్రకటన చేస్తారని అభిమానులు వేచి చూస్తున్నారు. ర‌జ‌నీ కోసం ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది డైరెక్ట‌ర్లు వెయిటింగ్. ఇందులో ప‌లువురు సీనియ‌ర్లు ఉండ‌గా కొత్త కుర్రాళ్లు కూడా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News