సౌంతిండియా సూపర్ స్టార్ అంటే రజనీకాంత్ నే చెప్పుకోవాలి. ఆయన మానియా అలాంటిది. కోలీవుడ్ తో మొదలెట్టి టాలీవుడ్ బాలీవుడ్ ని టచ్ చేసి ఖండాంతరాలకు కీర్తిని విస్తరించుకున్న నట దిగ్గజం రజనీకాంత్. నటుడిగా నాలుగు పదులు ప్రస్థానం పూర్తి అయింది. జీవితంలో ఏడు పదుల వయసు గడచింది. ఇక రజనీ అంటే ఊగిపోయే జనం తమిళనాట అడుగడుగునా కనిపిస్తారు. అలాంటి రజనీకాంత్ ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఆయన గత ఏడాది కాలంలో చాలా సార్లు ఆసుపత్రికి వెళ్ళి రావడం జరిగింది.
ఇది అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. రజనీ పార్టీ పెట్టాలే కానీ సీఎం ఆయనే అన్నంత వేవ్ ఆయన సొంతం. అయితే కేవలం అనారోగ్య కారణాల వల్లనే రజనీ రాజకీయాలకు స్వస్తి చెప్పారు. ఇపుడు తనను ఇంతటి వాడిని చేసిన సినీ సీమకు కూడా ఆయన దూరం కావాల్సి ఉంటుందా అన్న చర్చ అయితే ఉంది. దానికి కారణం రజనీ తరచూ అనారోగ్యం పాలు కావడమే. సినిమా చేయడం అంటే చిన్న విషయం కాదు. ఎంతో పరిశ్రమించాలి. అది కూడా హెల్త్ కండిషన్ బాగులేని పరిస్థితుల్లో డెబ్బై ఏళ్ల వయసులో అవసరమా అన్న ప్రశ్న అయితే ఫ్యామిలీలో తలెత్తే అవకాశం అయితే ఉంది.
ఈ రోజుకు రజనీ సినిమాలకు నో చెబుతున్నట్లుగా ఎక్కడా ప్రచారం అయితే లేదు. ఆయన చేతిలో కమిట్ అయిన సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. అయితే రజనీ ఆరోగ్యం దృష్ట్యా ఇక సినిమాలకు గుడ్ బై కొడితేనే బెటర్ అని శ్రేయోభిలాషులు కూడా కోరుకుంటున్నారుట. రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే తమ హీరో ఇంకా నటిస్తూనే ఉండాలని, ఆ మ్యాజిక్ లో తామంతా తన్మయం చెందాలని ఆశ పడుతున్నారు. అన్నాత్తేతో కలిపి ఇప్పటికి 168 సినిమాలు చేసిన రజనీ మరో రెండు సినిమాలు చేస్తే 170 మూవీస్ కంప్లీట్ అవుతాయి. అంటే ఈ తరంలో అన్ని సినిమాలు చేసిన సూపర్ స్టార్ హీరో ఎవరూ లేరు కాబట్టి ఆ రికార్డుకి చేరువ కావడానికి కేవలం రెండు మెట్ల దూరంలో రజనీ ఉన్నారు. మరి ఆ సినిమాలు ఆయన చేసి ఫుల్ స్టాప్ పెడతారా, లేక ఇక చాలు అనుకుంటారా. చూడాలి మరి ఏం జరుగుతుందో.