చైనాలో 2.0 రిలీజుకు చుక్కెదురు?

Update: 2019-06-26 14:23 GMT
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం '2.0' పోయినేడాది రిలీజ్ అయింది.  భారీ అంచనాల మధ్య విడుదలయిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.  తెలుగు వెర్షన్.. తమిళ వెర్షన్ కు నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా చూస్తే భారీ కలెక్షన్స్ వచ్చాయి. భారతదేశంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన కోలీవుడ్ చిత్రంగా నిలిచింది.

ఈ సినిమాను చైనాలో భారీ స్థాయిలో రిలీజ్ చేయాలనే ప్లాన్ తో కోసం '2.0' నిర్మాతలు చైనా డిస్ట్రిబ్యూషన్ హౌస్ హెచ్ వై మీడియాతో ఒప్పందం కుదుర్చుకున్నారట. ఆ ఒప్పందం ప్రకారం '2.0' చైనీస్ వెర్షన్ జూలై 12  న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారు.  చైనా వ్యాప్తంగా ఈ సినిమాను అరవై వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేసేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.  కానీ తాజాగా సమాచారం ప్రకారం హెచ్ వై మీడియా ఈ '2.0' విడుదల చేసే ఆలోచనను విరమించుకుందట.  దీనికి ఒక కారణం అదే సమయంలో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ చిత్రం 'ది లయన్ కింగ్'.  

అంతే కాకుండా ఈమధ్య హెచ్ వై మీడియా 'ప్యాడ్ మ్యాన్' లాంటి కొన్ని బాలీవుడ్ సినిమాలను చైనాలో రిలీజ్ చేసి చేతులు కాల్చుకుందట.  అందుకే '2.0' తో ఇప్పుడు రిస్క్ వద్దనుకున్నారట.  మరి '2.0' నిర్మాతలు కొత్త డిస్ట్రిబ్యూషన్ హౌస్ తో ఒప్పందం కుదుర్చుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.  ఈ విషయంపై ఇంకా '2.0' నిర్మాతలు స్పందించలేదు.  


Tags:    

Similar News