గత రెండు దశాబ్దాల్లో రజనీకాంత్ నటించిన ఏ సినిమాకూ లేని విధంగా ఆయన కొత్త చిత్రం ‘కాలా’కు విడుదలకు ముందు లో బజ్ నెలకొంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా తక్కువగానే ఉండబోతున్నాయని స్పష్టమైంది. ఎప్పట్లా రికార్డుల మోత మోగే పరిస్థితి కనిపించడం లేదు. దీనికి టాక్ కూడా అటు ఇటుగా ఉండటంతో ఓవరాల్ కలెక్షన్లు కూడా రజనీ రేంజికి తగ్గట్లుగా ఉండవని స్పష్టమవుతోంది. ఇదంతా చూసి రజనీ ప్రభ తగ్గిందా.. ఆయన పనైపోయిందా అంటూ వ్యాఖ్యానాలు మొదలుపెట్టేస్తున్నారు జనాలు. కానీ కొంచెం తర్కంతో ఆలోచిస్తే ఇందులో వాస్తవమెంత అన్నది బోధపడుతుంది.
రజనీ నుంచి ‘కాలా’ తర్వాత ‘2.0’ రాబోతోంది. ఆ సినిమా రిలీజయ్యే సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటే.. సూపర్ స్టార్ ప్రభ ఏమాత్రం తగ్గిందో అర్థమవుతుంది. ఆ సినిమా వచ్చే సమయానికి ఎప్పట్లాగే అంచనాలు తారా స్థాయికి చేరతాయి. ఆ చిత్ర టికెట్ల కోసం విపరీతమైన డిమాండ్ తప్పదు. దాన్ని ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత భారీగా రిలీజ్ చేయడం.. దాని వసూళ్లు కొత్త రికార్డులు నెలకొల్పడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ‘కాలా’ పరిస్థితి ఇలా తయారైందంటే అందుకు కారణాలు వేరు. ఎన్నో అంచనాలు పెట్టుకున్న ‘కబాలి’ తుస్సుమనిపించడంతో.. అదే కాంబినేషన్లో వెంటనే ఇంకో సినిమా రావడం.. అది కూడా ‘కబాలి’ స్టయిల్లోనే కనిపించడంతో జనాలకు ‘కాలా’పై అంచనాలు లేకుండా పోయాయి. అంతే తప్ప ఇక్కడ రజనీ ప్రభ తగ్గిందని అనుకోవడంలో అర్థం లేదు. నిజానికి ‘కాలా’ సినిమా చూస్తున్నపుడు కూడా తెరమీద రజనీ మూమెంట్స్ కనిపించినపుడు స్పందన మామూలుగా లేదు. ఈ చిత్రంలో కూడా రజనీ చరిష్మాను చూడొచ్చు. కాకపోతే దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడంతే.