తమిళనాడు ప్రజలంతా తలైవా అంటూ ఆప్యాయంగా పిలుచుకునే సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబంలో నిన్న ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. రజనీకి ఇద్దరు కుమార్తెలు కాగా... వారిలో ఒకరైన సౌందర్య ఇప్పుడు తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఈ వివరాల్లోకెళితే... రజనీ కూతురుగా సౌందర్యకు పెద్ద పెద్ద సంబంధాలే వచ్చాయి. చెన్నైకే చెందిన ప్రముఖ పారిశ్రామిక కుటుంబానికి చెందిన అశ్విన్ రామ్ కుమార్ తో ఆమె పెళ్లి 2010లో జరిగింది. ఈ దంపతులకు ఇప్పుడు రెండేళ్ల వయసున్న కుమారుడు కూడా ఉన్నాడు.
కుమారుడు పుట్టేదాకా వీరి కాపురం ఎలాంటి సమస్యలు లేకుండానే సాగినా... తొలి సంతానం తర్వాత వీరి మధ్య విభేదాలు పొడచూపాయి. అయితే ఈ విభేదాలు రచ్చకెక్కక ముందే... భార్యభర్తలు విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏడాది క్రితం పరస్పర అంగీకారంతోనే కోర్టులో వారు విడాకులు మంజూరు చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన చెన్నై ఫ్యామిలీ కోర్టు నిన్న తుది తీర్పును వెలువరించింది. సౌందర్య, అశ్విన్‌లకు వారి పరస్పర అంగీకారంతోనే విడాకులు మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పు చెప్పింది. అయితే భార్యాభర్తలుగా విడిపోయిన సౌందర్య, అశ్విన్‌లు వారి ఒక్కగానొక్క కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్న విషయంపైనా కోర్టుకెక్కే ముందే ఓ నిర్ణయానికి వచ్చారట.
ఈ నిర్ణయం ప్రకారం భర్త నుంచి విడాకులు తీసుకున్న సౌందర్య తన కుమారుడిని తనతోనే ఉంచేసుకుంటారట. అంటే... పెళ్లైన ఆరేళ్లకే తండ్రి ఇంటికి చేరిన సౌందర్య... ఇప్పుడు శాశ్వతంగానే భర్తకు దూరంగా తండ్రి ఇంటిలోనే ఉండిపోనుందన్న మాట. ఇప్పుడిప్పుడే సినిమా నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్న సౌందర్య... తన సోదరి ఐశ్వర్య భర్త, కోలీవుడ్ యంగ్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న వీఐపీ2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మున్ముందు కూడా సౌందర్య డైరెక్టర్‌గా బిజీ కానున్నట్లు సమాచారం.