రజినీ డబుల్ ఆఫర్ టూ మచ్

Update: 2017-06-14 04:37 GMT
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక సూపర్ స్టార్ సినిమా ఏడాదికి ఒకటి రావడమే గగనం అయిపోయింది. అటువంటిది సూపర్ స్టార్స్ అనే మాటకు విలువ పెంచిన రజినీకాంత్ సినిమాలు వరుసగా రెండు సినిమాలు విడుదలకాబోతున్నాయి. ఆయన ఇప్పుడు కాలా షూటింగ్లో  తీరికలేకుండా ఒక షెడ్యూల్ పూర్తికాగానే మరో షెడ్యూల్ ప్రారంభిస్తున్నాడు. కాలా సినిమా షూటింగ్  కోసం ముంబాయ్ వెళ్ళిన టీమ్ అక్కడ పూర్తి చేసుకొని చెన్నై లో మొదలుపెట్టనున్నారు.

విషయం ఏంటంటే.. కాలా కన్నా ముందు శంకర్ రజినీ కాంబినేషన్ లో వస్తున్న 2.0 షూటింగ్ సంవత్సరాల క్రితమే మొదలుపెట్టారు. 2.0 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కోసం ఇంకా చాలా  సమయం పట్టేలా ఉందిని చెన్నై యూనిట్ వాళ్ళు చెబుతున్నారు. ఈ సినిమా జనవరి 25 నాడు విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు కాలా సినిమా సెకండ్ షెడ్యూల్ కూడా మొదలుకావడంతో ప్రొడ్యూసర్ ధనుష్ 2.0 కన్నా ముందే కాలా సినిమాను విడుదల చేయడానికి ఆలోచిస్తున్నాడట. నవంబర్ నెలలో బహుశా విడుదల చేయవచ్చు. ఇదే జరిగితే మొత్తం సినీ అభిమానులకు బ్రహ్మోత్సవం అనే చెప్పాలి. దగ్గర దగ్గరలో రెండు సూపర్ స్టార్ సినిమాలు చూసే అవకాశం దక్కుతుంది. కాకపోతే ఇలా టూమచ్ డబుల్ ఆఫర్ ఎందుకంటారు?

ఇప్పుడు రజినీ రాజీకియా ప్రవేశం పై అంతటా తీవ్ర చర్చులు సాగుతున్నాయి. రజినీ కూడా ఇదే తగిన సమయం అని భావిస్తునట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అతని రాజకీయ ఎంట్రీ కి ముందే ఈ రెండు సినిమాలు పూర్తి చేయదలుచుకున్నారు అని అందుకే ఇంత హడావిడిగా షూటింగ్ జరిపిస్తున్నారు అని సాంబార్ బాబులు చెవులు కొరుక్కుంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News