అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్.. షారుఖ్ ఖాన్.. ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్స్. వాళ్ల బొమ్మ పోస్టర్ మీద కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు పొలోమని థియేటర్లకు వెళ్లిపోతారు. అయినప్పటికీ వాళ్లు తమ సినిమా ప్రమోషన్ ను లైట్ తీసుకోరు. సినిమా విడుదలకు కొన్ని వారాల ముందు నుంచే కాలికి బలపం కట్టుకుని తిరిగేస్తారు. మీడియా వాళ్లను కలుస్తారు. ఇంటర్వ్యూలిస్తారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. టీవీల్లో సందడి చేస్తారు. ఇంతకుముందు సౌత్ ఇండియన్ స్టార్లు మడిగట్టుకుని కూర్చునేవాళ్లు కానీ.. ఇప్పుడు వాళ్లు కూడా బాలీవుడ్ హీరోల్ని అనుసరిస్తున్నారు. ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. చివరికి ఎప్పుడూ తన సినిమాల్ని ప్రమోట్ చేయని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాకు మెట్టు దిగాడు. సినిమాను ప్రమోట్ చేశాడు.
ఐతే ఇండియాలో తన సినిమాను అసలేమాత్రం ప్రమోట్ చేయని ఏకైక స్టార్ మాత్రం సూపర్ స్టార్ రజినీకాంతే అని చెప్పాలి. మహా అయితే ఆడియో వేడుకకు వస్తారు తప్పితే.. రజినీ తన సినిమాలు వేటినీ ప్రమోట్ చేయరు. మీడియా వాళ్లకు ఇంటర్వ్యూలివ్వరు. ప్రమోషన్లలో పాల్గొనడు. అయినా ఆయన సినిమాలకు ఎలాంటి క్రేజ్ వస్తుందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ‘కబాలి’ సినిమాకైతే కనీసం రజినీ ఆడియో వేడుకకు కూడా హాజరు కాలేదు. కానీ ఈ సినిమా క్రేజ్ ఏ స్థాయికి చేరిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం నిమిషం నిడివి ఉన్న టీజర్ ఒకటి వదిలారంతే. అందులో అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మెస్మరైజ్ చేసేశాడు రజినీ. అంతే ‘కబాలి’ క్రేజ్ పీక్స్ కు వెళ్లిపోయింది. సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ అయిపోయింది. సినిమాకు విపరీతమైన హైప్ వచ్చింది. ఆకాశాన్నంటే అంచనాల మధ్య సినిమా వచ్చే శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ క్రేజ్ చూసే రజినీ కాంత్ సిసలైన సూపర్ స్టార్ అని బాలీవుడ్ జనాలు కూడా అంగీకరిస్తున్నారు.