తమిళ తంబీలకు దీపావళి సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. ఉత్తరాది వాళ్లు ఆర్యులైన దేవతా సంతతికి పూజ్యులైతే.. రాక్షస అంశ నుంచి జన్మించిన వారు తమిళ సంతతి అన్నది పురాణ చరిత్ర. అందుకు తగ్గట్టే దీపావళి సెంటిమెంట్ అక్కడ బలంగా ఉంటుంది. దీపాల అమావాస్యకు తెలుగు వారు ఏ ముహూర్తాలు రిలీజ్ లు ప్లాన్ చేయరు కానీ.. తమిళులు మాత్రం ఆరోజు పుణ్యకార్యాలన్నీ చేస్తుంటారు. కోలీవుడ్ లో విజయ్ .. అజిత్ లాంటి పెద్ద స్టార్లు దీపావళి రిలీజ్ ని చాలా పెద్ద సెంటిమెంటుగానూ భావిస్తారు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పంథా వేరు. ఆయన ఎక్కువగా సంక్రాంతి బరిలో వస్తున్నారు. కానీ ఈసారి రూల్ ని బ్రేక్ చేసి దీపావళి రేస్ ని ఎంపకి చేయడం తంబీల్లో ఆసక్తికర చర్చకు తావిచ్చింది. రజనీకాంత్ కథానాయకుడిగా దరువు శివ తెరకెక్కిస్తున్న అన్నాథే ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. అంటే ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ లో దసరా కానుకగా వస్తుంటే.. అన్నాథే నవంబర్ లో దీపావళి కానుకగా రిలీజ్ కానుందన్నమాట.
ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ తేదీ ప్రకటించిన అనంతరం సూపర్ స్టార్ రజనీకాంత్ `అన్నాథే` విడుదల తేదీని ప్రకటించారు. 2021 నవంబర్ 4 న దీపావళి కానుకగా వస్తోంది. అయితే ఈ రిలీజ్ కి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపు 26 సంవత్సరాల తరువాత రజనీకాంత్ దీపావళి విడుదలను ఎంచుకున్నారు. 1995 లో `ముత్తు` ఈ సీజన్ లోనే రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టింది. కానీ ఆ తర్వాత ఇన్నేళ్లలో ఏనాడూ దీపావళి బరిలో తలైవా రాలేదు. ఇప్పటికి ఇది సాధ్యమైంది.
అన్నాథే ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఇందులో ఖుష్బూ- మీనా- కీర్తి సురేష్ - ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు తెరవెనక పని చేస్తున్నారు. అనారోగ్య కారణాలతో రజనీ కాంత్ రాజకీయారంగేట్రాన్ని ఇటీవల వాయిదా వేసిన సంగతి తెలిసినదే.