కర్ణాటకలో బొమ్మ పడని ‘కాలా’

Update: 2018-06-07 11:37 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి ప్రదర్శితమవుతోంది. కానీ ఎంత ప్రాధేయపడ్డా కానీ కర్ణాటకలో మాత్రం ఈ సినిమా రిలీజ్ కు నోచుకోలేదు.. కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో ఆందోళనకారులు ‘కాలా’ మూవీ విడుదలను అడ్డుకున్నారు. కాలా చిత్రాన్ని కర్ణాటకలో రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో వారికి భయపడి థియేటర్ యజమానులు ఒక్క థియేటర్ లో కూడా సినిమాను వేయలేదు.

కావేరి జలవివాదం నేపథ్యంలో తమిళలకు మద్దతుగా రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు కర్ణాటకలో ఆయన సినిమా విడుదల కాకుండా అడ్డుకోవడానికి కారణమైంది. కాలా మూవీని ఆడనివ్వాలని కన్నడిగులకు రజినీకాంత్  ఎంత ప్రాధేయపడ్డా వారు పంతం నెగ్గించుకోవడంతో ఫలితం లేకుండా పోయింది.

రజినీకాంత్  కాలా చిత్రం కర్ణాటకలో విడుదల చేయించేందుకు నానా రకాల ప్రయత్నాలు చేశారు. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీం కూడా కర్ణాటకలో ఆడించేందుకు అనుమతి ఇచ్చింది.  చిత్రం ప్రశాంతంగా విడుదలయ్యేలా చూడాలని కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. భద్రత కల్పించాలని చెప్పింది. కానీ కర్ణాటక ప్రభుత్వం పట్టించుకోకపోవడం.. నిరసన కారులు వెనక్కి తగ్గకపోవడంతో కాలా కర్ణాటకలో ఒక్క షో కూడా పడకుండా నిలిచిపోయింది. దీంతో కర్ణాటకలోని  రజినీకాంత్ అభిమానులు పొరుగు రాష్ట్రాలకు   సినిమా చూసేందుకు వెళుతున్నారు.
Tags:    

Similar News