దేశంలో ఎందరో స్టార్లు ఉండొచ్చు.. కానీ ‘సూపర్ స్టార్’ మాత్రం తానొక్కడినే అని రుజువు చేస్తున్నాడు రజినీకాంత్. తన కొత్త సినిమా ‘కబాలి’ టీజర్ తో రజినీ ఆ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. ఈ టీజర్ ధాటికి ఇండియన్ సినిమాకు సంబంధించి యూట్యూబ్ రికార్డులన్నీ బద్దలవుతున్నాయి. కేవలం 24 గంటల్లోనే 50 లక్షల హిట్స్ తో బాలీవుడ్ సినిమాలకు సైతం కాని ఘనతను ‘కబాలి’ అందుకున్న సంగతి తెలిసిందే. అంతకుముందు ‘దిల్ వాలే’ టీజర్ 36 లక్షలతో నెలకొల్పిన రికార్డును భారీ తేడాతో బద్దలు కొట్టింది ‘కబాలి’. ఇండియా మొత్తం మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమా నెలకొల్పిన రికార్డును.. ఓ సౌత్ మూవీ ఇంత తేడాతో బద్దలు కొట్టడం మామూలు విషయం కాదు.
మామూలుగా యూట్యూబ్ వ్యూస్ విషయంలో తొలి రోజు ఉండే ఊపు రెండో రోజు కొనసాగదు. మొదటి రోజే టీజర్ చాలా వరకు చూసేస్తారు. ఐతే ‘కబాలి’ విషయంలో మాత్రం రెండో రోజు కూడా భారీగానే వ్యూస్ వచ్చాయి. 24 గంటల్లో 50 లక్షల వ్యూస్ పూర్తి చేసుకున్న ‘కబాలి’ తమిళ టీజర్ 80 లక్షల మార్కును 42 గంటల్లోనే టచ్ చేయడం విశేషం. ప్రస్తుతం కబాలి వ్యూస్ 84 లక్షలకు దగ్గరగా ఉన్నాయి. తెలుగు టీజర్ 10 లక్షల మార్కును టచ్ చేసింది. కాబట్టి మూడో రోజే కోటి వ్యూస్ మార్కును టచ్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు లైక్స్ విషయంలోనూ కబాలి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు లక్షల లైక్స్ మార్కును టచ్ చేసింది ‘కబాలి’. ఇప్పటిదాకా అసలు ఏ ఇండియన్ సినిమా టీజర్ కూడా 3 లక్షల మార్కును అందుకోలేదు.