సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా వస్తోందంటే దాంతో పాటే ఏదో ఒక వివాదం కూడా రావాల్సిందే. ఆయన సినిమాకు ఏదో రకమైన అడ్డంకి ఎదురవడం మామూలే. ఇప్పుడు ‘కాలా’కు కూడా తలనొప్పి తప్పేట్లు లేదు. ఈ చిత్రం కర్ణాటకలో విడుదల కావడం కష్టంగానే ఉంది. ‘కాలా’ చిత్రాన్ని తమ రాష్ట్రంలో విడుదల చేయనివ్వబోమని కన్నడ సంఘాలు.. రాజకీయ పార్టీలు తేల్చి చెబుతున్నాయి. ఆల్రెడీ కొందరు ఆందోళనలు కూడా నిర్వహించారు. ప్రెస్ మీట్లు పెట్టి మరీ హెచ్చరికలు జారీ చేశారు. గత నెలలో కావేరీ జలాల వివాదానికి సంబంధించి రజనీ తమిళనాడులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. కర్ణాటకకు వ్యతిరేకంగా.. తమిళనాడు ప్రయోజనాలకు అనుగుణంగా మాట్లాడాడు. ఇది కన్నడిగులకు ఆగ్రహం తెప్పించింది.
స్వయంగా కన్నడిగుడైన రజనీకాంత్ తన రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మాట్లాడటం ఏంటని అక్కడి నేతలు ప్రశ్నిస్తున్నారు. రజనీతో పాటు కమల్ సినిమాలు వేటినీ ఇక్కడ ఆడనివ్వబోమని తేల్చి చెప్పారు. ఇంతకుముందు సత్యరాజ్ కర్ణాటకకు వ్యతిరేకంగా మాట్లాడాడని.. ‘బాహుబలి: ది కంక్లూజన్’కు అడ్డు తగిలారు కన్నడిగులు. అప్పుడు సత్యరాజ్ తో పాటు రాజమౌళి వారికి సర్దిచెప్పి సినిమాను రిలీజ్ చేయించుకున్నారు. మరిప్పుడు రజినీ ఏం చేస్తాడో చూడాలి. కర్ణాటక మార్కెట్ చిన్నది కాదు. అక్కడ తమిళ.. కన్నడ సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయి. రజనీ సినిమాలకు అక్కడ పదుల కోట్లలో వసూళ్లు వస్తాయి. ఈ నేపథ్యంలో ‘కాలా’ను నిర్మాత ధనుష్ అండ్ కో కర్ణాటకలో ఎలా రిలీజ్ చేసుకుంటారో చూడాలి. రజనీ సైలెంటుగా ఉంటే మాత్రం ఈ సినిమాకు అక్కడ మోక్షం కలగకపోవచ్చు.