సూపర్ స్టార్ సిగరెట్ స్టైల్ వెనక ఆయన..!

Update: 2018-12-01 06:56 GMT
చాలామంది స్టార్స్ ఉంటారు గానీ సూపర్ స్టార్ రజనీకాంత్ ది మాత్రం ఓ భిన్నమైన స్టైల్. కరెక్ట్ గా చెప్తే స్టైల్ కు.. మ్యానరిజంకు కేరాఫ్ అడ్రెస్ ఆయన.  అయన యాక్టింగ్ కంటే స్టైలే అశేష అభిమానగణాన్ని సంపాదించి పెట్టింది.  ఇక అయన అన్నీ స్టైల్స్ లో నూ సిగరెట్ వెలిగించే స్టైల్ ప్రత్యేకమైనది.  ఆయనకు మాత్రమే పరిమితమైన సిగ్నేచర్  మూమెంట్  అది.  ఈమధ్య రిలీజ్ అయిన '2.0' లో అలాంటి స్టైల్ వచ్చినప్పుడు థియేటర్లు విజిల్స్ తో హోరెత్తాయి.

మరి ఇలాంటి సిగ్నేచర్ మూమెంట్ వెనకున్న రహస్యాన్ని సూపర్ స్టార్ ఈమధ్యనే వెల్లడించారు.  ఈ సిగరెట్ వెలిగించే స్టైల్ ను సీనియర్ బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హాను చూసి నేర్చుకున్నానని తెలిపాడు. కాకుంటే అయన దగ్గర నేర్చుకున్న స్టైల్ కు తన మ్యానరిజం జోడించానని తెలిపాడు. ఇక ఎప్పుడుపడితే అప్పుడు సిగరెట్ ను నోట్లోకి విసిరితే సరిపోదని అలాంటి స్టైల్ ను డిమాండ్ చేసే సందర్భం ఉంటేనే బాగుంటుందని తెలిపాడు.

ఏదేమైనా రజనీకే స్టైల్ విషయంలో ఇన్స్పిరేషన్ గా నిలిచాడంటే అయనకు ఒక దణ్ణం పెట్టొచ్చు. మరి అయన సిగరెట్ వెలిగించే స్టైల్ ఎలా ఉంటుందో? ఇంతకీ ఈ శత్రుఘ్న సిన్హా ఎవరనుకున్నారు? 'దబాంగ్' తో బాలీవుడ్ హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన సోనాక్షిసిన్హా నాన్నగారు.



Tags:    

Similar News