పెట్టా వెనుక ప్లాన్ ఉందా?

Update: 2018-12-01 11:54 GMT
ఎన్నడూ లేనిది సూపర్ స్టార్ రజనీకాంత్ కేవలం ఏడాది వ్యవధిలో మూడు సినిమాలతో రావడం అభిమానులనే ఆశ్చర్యపరుస్తోంది. 2.0 లాంటి భారీ విజువల్ వండర్ మూవీ వచ్చిన తర్వాత కూడా అతి తక్కువ గ్యాప్ లో పెట్టాకు రంగం సిద్ధం కావడం చూసి షాక్ తింటున్న వాళ్ళే ఎక్కువ. పెట్టా విషయంలో ఇక్కడ మరొక ట్విస్ట్ ఉంది. ఇటు తెలుగులో అటు తమిళ్ లో సంక్రాంతికి విపరీతమైన పోటీ ఉంది. మన దగ్గర వినయ విధేయ రామ-ఎన్టీఆర్-ఎఫ్2 లకే థియేటర్లు సరిపోతాయా లేదా అని డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు. మధ్యలో నేనొస్తా అంటూ రజని పెట్టాతో వస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి.

హక్కులు ఎవరు తీసుకుంటారు అనేది ఇంకా ఖరారు కానప్పటికి ఎంతో కొంత మంచి కౌంట్ అయితే దక్కే తీరుతుంది. మరోవైపు తమిళ్ లో అజిత్ తన విశ్వాసంతో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు వయసులో ఉన్న మాస్ గెటప్స్ లో అజిత్ లుక్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇలా రెండు వైపులా ఇంత పోటీ పెట్టుకుని పెట్టాని తీసుకురావడం వల్ల లాభమేమిటి అనేది పక్కన పెడితే సన్ పిక్చర్స్ చాలా తెలివైన ఎత్తుగడతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. గత కొన్నేళ్లలో ఏ సినిమాలోనూ లేని పక్కా మాస్ మసాలాలు పెట్టాలో ఉన్నాయని ఇంకా చెప్పాలంటే పడయప్పా(తెలుగు నరసింహ)-బాషా రేంజ్ హీరోయిజం ఇందులో ఉందని ఎంత పోటీ ఉన్నా నిలబడుతుందనే నమ్మకంతో రెడీ అయినట్టు చెబుతున్నారు.

అయితే పెట్టా హక్కులను అవుట్ రైట్ గా మరో సంస్థకు అమ్మే ఆలోచనలో ఉన్నట్టు మరో న్యూస్ కూడా ప్రచారంలో ఉంది. ఏది ఎలా ఉన్నా మొత్తం నాలుగు క్రేజీ సినిమాలతో పెట్టా ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా రజని ఇమేజ్ కు జరిగే డ్యామేజ్ మాములుగా ఉండదు. అసలే కబాలి-లింగా-కాలా గాయాలు ఇంకా  పచ్చిగానే ఉన్నాయి. 2.0 ఫైనల్ స్టేటస్ ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం సబబు కాదు. పెట్టా గట్టి పోటీ ఇచ్చేలా వస్తాడా లేక పోటీలో నలిగిపోతాడా వేచి చూడాలి
    

Tags:    

Similar News