దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన కాంబినేషన్ లు మళ్లీ వర్కవుట్ అవుతాయంటే కష్టమే. అప్నుడున్న క్రేజ్ ఇప్పడు వుండదు.. పైగా ఆ స్థాయిలో మ్యాజిక్ చేస్తారంటే నమ్మడం కష్టమే. అయితే కొన్ని కాంబినేషన్ లని మళ్లీ తెరపై చూడాలని ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తుంటారు. అలాంటి కాంబినేషన్ దశాబ్దాల తరువాత కలిసి నటించబోతోంది. ఆ హిట్ కాంబినేషనే సూపర్ స్టార్ రజనీకాంత్ - రమ్యకృష్ణ.
రజనీకాంత్ నటించిన `పడయప్పా` తెలుగులో `నరసింహ`గా 1999లో విడుదలై రెండు భాషల్లోనూ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
కె.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ రజనీ కెరీర్ లోనే భారీ వసూళ్లని రాబట్టిన సినిమాగా నిలిచి రికార్డులు తిరగరాసింది. ఇందులో రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్ లుగా నటించారు. నీలాంబరిగా రమ్యకృష్ణ నటన ముందు రజనీ తేలిపోయాడా? అనేంతగా ఈ మూవీ విజయంలో రమ్యకృష్ణ పాత్ర కీలకంగా నిలిచింది. ఇప్పటికీ రమ్యకృష్ణ కెరీర్ లో ఓ మైల్ స్టోన్ గా, మెమరబుల్ క్యారెక్టర్ గా నిలిచిపోయింది. ఈ మూవీ తరువాత రమ్యకృష్ణ .. రజనీతో కలిసి మరో సినిమాలో కనిపించలేదు.
మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరు కలిసి నటించబోతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ `జైలర్`. బీస్ట్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ పాత్రలో రజనీ నటిస్తున్న ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. `విక్రమ్` బీజీఎమ్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన అనిరుధ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. బుధవారం షూటింగ్ ప్రారంభమైంది. త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ మూవీలో రజనీతో పాటు సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ నటిస్తోందని తాజాగా తెలిసింది. ఇందులో రమ్యకృష్ణ క్యారెక్టర్ ఏంటీ? ఎలా వుండబోతోందన్నది మాత్రం ఇంకా తెలియాల్సి వుంది. రజనీకాంత్ ఆగస్టు 22 నుంచి సెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఎంటైర్ షూటింగ్ మొత్తం జైల్ నేపథ్యంలో సాగనున్న ఈ మూవీ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ జైల్ సెట్ ని నిర్మించారు. ఇందులోనే ప్రధాన పోర్షన్ మొత్తం పూర్తి చేయనున్నారట.
అక్టోబర్ వరకు ఎంటైర్ షూటింగ్ ని పూర్తి చేయాలని ప్లాన్ చేశారట. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తయితే వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని పూర్తి చేసిన సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్ పిక్చర్స్ వర్గాలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిసింది. దశాబ్దాల విరామం తరువాత మళ్లీ కలిసి నటిస్తున్న రజనీ, రమ్మకృష్ణల ఔట్ డేటెడ్ కాంబినేషన్ వర్కవుట్ అవుతుందా? .. మళ్లీ ఆ మ్యాజిక్ ని చేస్తారా? అన్నది అనుమానమే.