ఒకవైపు రాజకీయాల్లోకి వెళ్లేలా కనిపిస్తున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలతో ఆయన ఎంట్రీ ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతూ ఉంది. ఆ లోపు వీలైనన్ని సినిమాలు చేసేలా ఉన్నారు. అయితే అవి ఒక్కటి కూడా ఆయన స్థాయికి తగ్గ హిట్ అనిపించుకోవడం లేదు. ఆ సినిమాలకు వసూళ్లు భారీ స్థాయిలో ఉన్నా.. ఆ వసూళ్లు వాటి బడ్జెట్ స్థాయిలో ఉండటం లేదు. ఈ క్రమంలో ఆ సినిమాలు ఫెయిల్యూర్ అనే ట్యాగ్ ను ఎదుర్కొంటూ ఉన్నాయి.
ఇలాంటి క్రమంలో..సూపర్ స్టార్ కెరీర్ లో మరో సినిమా ఫెయిల్ గా నిలుస్తోంది. అదే దర్బార్. పేరులో ఉన్న ఊపు సినిమాలో లేకపోవడంతో ఆ సినిమా ఆకట్టుకోలేదు. ఓ మోస్తరు వసూళ్లు వచ్చినా.. ఆ సినిమా బడ్జెట్ కు వాటితో సంబంధం లేకుండా పోయింది. ఇలాంటి నేపథ్యంలో దర్బార్ కు సంబంధించి షాకింగ్ ఫిగర్స్ బయటకు వస్తున్నాయి.
ఆ సినిమా మేకింగ్ ఖర్చులో 50 శాతం వరకూ ఒక్క హీరో రెమ్యూనరేషనే వెళ్లిందనే టాక్ వినిపిస్తోంది. దర్భార్ సినిమా బడ్జెట్ దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు కాగా.. అందులో 108 కోట్ల రూపాయలు కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ తన రెమ్యూనరేషన్ గా తీసుకున్నారట! అలా రికార్డు స్థాయి పారితోషకాన్ని పొందారు రజనీకాంత్. ఆ రికార్డు స్థాయి పారితోషకంతో రజనీకాంత్ రికార్డే సృష్టించి ఉండవచ్చు గాక, కానీ ఇప్పుడు ఆ సినిమా వసూళ్లు తగు స్థాయిలో లేకపోవడంతో.. డిజాస్టర్ అనే విమర్శను ఎదుర్కొంటూ ఉంది. భారీ పారితోషకం తీసకోవడం గొప్ప కావొచ్చు. అయితే తన సినిమా ఫెయిల్యూర్ అనేది ఏ హీరోకి అయినా అంత మంచి ప్రచారం కాదేమో!