రజినీ సినిమాకి ఆ కొంచెమే పెండింగ్

Update: 2017-03-10 12:24 GMT
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 2.0. రోబో సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశంలోనే ఉన్నాయి. గతేడాది తొలి అర్ధ భాగంలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా.. ఇప్పుడు చివరి దశకు చేరుకుందని చెప్పాడు దర్శకుడు శంకర్.

2.0 మూవీకి గ్రాఫిక్స్ వర్క్ చాలా కీలకం కావడంతో.. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసేసేందుకు శంకర్ అహోరాత్రులు కష్టపడుతున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూట్ పూర్తయిపోగా.. ఇప్పుడు ఒక పాట.. కొంత ప్యాచ్ మాత్రమే పెండింగ్ ఉందట. "2.0 కోసం ఓ ప్రధానమైన సీన్ ని పిక్చరైజ్ చేసిన తర్వాత.. నా టీం వీరంతా. ఒక పాట.. కొంత ప్యాచ్ మాత్రమే షూట్ చేయాలి" అని ట్వీట్ చేసిన శంకర్.. తన టీం ఫోటో కూడా పోస్ట్ చేశాడు. ఇప్పడు శంకర్ నుంచి మూవీపై అఫీషియల్ స్టేట్మెంట్ రావడంతో.. రజినీ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నారు.

రజినీ ఈ చిత్రంలో రోబోగా.. సైంటిస్ట్ గా డ్యుయల్ రోల్స్ పోషిస్తుండగా.. అమీజాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లీడ్ విలన్ గా నటిస్తుండగా.. సుధాంశు పాండే.. ఆదిల్ హుస్సేన్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News