తమిళం నుంచి తెలుగులోకి రీమేక్ సూపర్ హిట్ అయిన సినిమాల్లో ‘కొండపల్లి రాజా’ ఒకటి. అందులో వెంకటేష్ లేడీస్ హాస్టల్లోకి వెళ్లడం.. పామును చూసి తెగ బయపడటం.. అది అతడి మెడను చుట్టేస్తుంటే వణికిపోవడం గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా తమిళ మాతృక ‘అన్నామలై’లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో. అందులోనూ ఈ పాము సీన్ భలే హైలైట్ అయింది. రజినీ తనదైన శైలిలో హావభావాలతో ఈ సన్నివేశాన్ని రక్తి కట్టించాడు. ఐతే ఈ సీన్ షూట్ చేసేటపుడు ఒక ఊహించని పరిణామం జరిగిందట. ఎవ్వరికీ తెలియని ఆ విషయాన్ని డైరెక్టర్ సురేష్ కృష్ణ ఓ ఇంటర్వ్యూలో పట్టించుకున్నాడు.
‘‘ఆ రోజు పాము సీన్ తీయడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఐతే ఈ సన్నివేశం కోసం ట్రైనింగ్ ఇచ్చిన పామును తీసుకు రాలేదు. ఐతే షూటింగుకి అంతా రెడీగా ఉండటంతో ఎలాగోలా కానిచ్చేద్దామని అనుకున్నాం. పాముల వాడు ఊరికే అలా పామును వదిలేశాడు. ఆశ్చర్యకరంగా పాము దాని ఇష్టానుసారం రజినీ మీదికి ఎక్కి ఇష్టానుసారం విన్యాసాలు చేసింది. శివుడి మెడలో పాములా చుట్టుకుంది. రజినీ ఒరిజినల్ భయాన్నే క్యాప్చర్ చేశాం. సన్నివేశం పూర్తయినా నేను కట్ చెప్పలేదు. రజినీ పాముకు భయపడి గట్టిగా అరవలేకపోయారు. భయం భయంగానే కట్ చెప్పండయ్యా అంటూ నసిగాడు. మొత్తానికి ఆ సన్నివేశం చాలా బాగా వచ్చింది. ఐతే ఆ తర్వాత బయటికి వెళ్తే అక్కడ మేనేజర్, పాముల వాడు గొడవ పడుతుంటే వెళ్లి.. డబ్బుల విషయంలో ఏదో తేడా వచ్చిందేమో అని అడిగా. అప్పుడు మేనేజర్ చెప్పాడు.. పాముకు నోరే కుట్టలేదని. నాకు ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుంది. ఇలాంటపుడు పాము కరవకుండా నోరు కట్టేస్తుంటారు. ఒకవేళ ఆ పాము రజినీని కాటేసి ఉంటే నా పరిస్థితి ఏమయ్యేదో అని వణికిపోయా. ఈ విషయాన్ని రజినీకి చెబితే తనదైన స్టయిల్లో ఓ నవ్వు నవ్వేసి వెళ్లిపోయారు. దటీజ్ రజినీ’’ అని సురేష్ కృష్ణ చెప్పాడు.