2.ఓ స్క్రిప్టుపై ర‌జ‌నీ అసంతృప్తి

Update: 2018-09-19 04:50 GMT
సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ -  అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన చిత్రం `2.ఓ`. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు 540 కోట్ల బ‌డ్జెట్‌ తో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది హాలీవుడ్ సినిమాల‌కు ఏమాత్రం తీసిపోని సినిమా అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవ‌లే 2.ఓ టీజ‌ర్ రిలీజై ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల్ని ఆక‌ట్టుకుంది. నిమిషాలు - గంట‌ల్లోనే కోట్లాది వ్యూస్‌ ని ద‌క్కించుకుంది ఈ టీజ‌ర్‌. శంక‌ర్ మ‌రో విజువ‌ల్ వండ‌ర్‌ ని అభిమానుల‌కు అందించ‌బోతున్నాడ‌ని టీజ‌ర్ చూస్తే అర్థ‌మైంది. అయితే ఈ సినిమాపైనా - శంక‌ర్ పైనా ఉత్త‌రాదిన య‌థావిధిగానే దుష్ప్ర‌చారం సాగుతోంది. 2.ఓ టీజ‌ర్‌ ని త‌క్కువ చేసి చూపించే జాత్యాహంకారం క‌నిపిస్తోంది. ఒక ద‌క్షిణాది వాడి గొప్ప‌త‌నాన్ని ఒప్పుకునేందుకు బాలీవుడ్ వాళ్ల అహం మ‌రోసారి `2.ఓ` టీజ‌ర్ సాక్షిగా బ‌య‌ట‌ప‌డింది. 

అదంతా అటుంచితే.. ఈ సినిమాలో త‌న పాత్ర విష‌య‌మై సూప‌ర్‌ స్టార్‌ ర‌జ‌నీకాంత్ అసంతృప్తిగా ఉన్నార‌ని మ‌రో కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. ఓవైపు టీజ‌ర్‌ లో అక్ష‌య్ కుమార్‌ ని స‌రిగా చూపించ‌లేద‌ని ఉత్త‌రాది అభిమానులు హ‌ర్ట‌యిపోయార‌న్న ప్ర‌చారం న‌డుమ‌, మ‌రోవైపు ర‌జ‌నీ పాత్ర‌నే స‌రిగా లేద‌న్న కొత్త ప్ర‌చారం సాగుతోంది. నిజానికి టీజ‌ర్‌ లో కిలాడీ అక్ష‌య్ పాత్ర‌నే శంక‌ర్ ఎక్కువ హైలైట్ చేశాడు. ప్ర‌తినాయ‌కుడిని అత్యంత బ‌లంగా చూపించే శంక‌ర్ ఈసారీ అదే చూపించాడు. అక్ష‌య్‌ బ‌లాన్ని క్రోమ్యాన్ గెట‌ప్‌ తో గొప్ప‌గా ఆవిష్కరించాడు. మ‌ధ్య‌లో చిట్టీ ఈజ్ బ్యాక్! అనే పాయింట్ త‌ప్ప ఎక్క‌డా ర‌జ‌నీకాంత్ గొప్ప‌ను చూపించే ప్ర‌య‌త్న‌మే చేయ‌లేదు శంక‌ర్. అంత బ్యాలెన్స్‌డ్‌ గా టీజ‌ర్‌ ని డిజైన్ చేస్తే ఎవ‌రికి వారు ఎవ‌రికి తోచిన ప్ర‌చారం వాళ్లు చేశారు.

అదంతా స‌రే.. కిలాడీ క్రోమ్యాన్ పాత్ర‌ను హైలైట్ చేసిన తీరుగా ర‌జ‌నీని హైలైట్ చేయ‌లేద‌ని ఆయ‌న ఫ్యాన్స్ హ‌ర్ట‌య్యార‌న్న‌ది కొత్త ప్ర‌చారం ఎందుకు? అయినా ఈ పాయింట్‌ ను అంగీక‌రించి తీరాల్సిందే. మ‌న‌కంటే దాదాపు ప‌ది రెట్లు పెద్ద‌దిగా ఉండే హిందీ మార్కెట్‌ ని కొల్ల‌గొట్టాలంటే ఇంత కంటే త‌రుణోపాయం శంక‌ర్‌ కి ఏం ఉంటుంది? బ‌హుశా ఆ తెలివితేట‌ల్నే చూపించాడ‌ని భావించ‌వచ్చు. అన్న‌ట్టు 2.ఓ క‌థేంటో తెలుసా?  .. త‌ర్వాత ఆర్టిక‌ల్‌ లో .. అంత‌వ‌ర‌కూ కీప్ వాచ్ దిస్ స్పేస్‌.
Tags:    

Similar News