బాలీవుడ్ సినిమాల్లో మసాలా పాళ్లు అధికంగానే ఉంటున్నా... దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై తూటాలు సంధిస్తున్న సినిమాలు కూడా ఇప్పుడు అక్కడి నుంచి వచ్చేస్తున్నాయి. వివాదాలు చుట్టుముట్టినా కూడా ఈ తరహా చిత్రాల పరంపర ఇప్పుడు బాగానే పెరిగిందనే చెప్పాలి. మాధుర్ భండార్కర్ - రాంగోపాల్ వర్మ - తాజా కొత్తగా వచ్చేస్తున్న పలువురు డైరెక్టర్లు ఈ తరహా చిత్రాలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ క్రమంలోనే భారత ఎన్నికలు ఎంత సంక్లిష్టమో... ఎంత ఖర్చుతో కూడుకున్నవో కళ్లకు కట్టేలా ఓ చిత్రం రాబోతోంది. *న్యూటన్* పేరిట తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావ్ ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ నేటి ఉదయం విడుదలైంది. దేశంలో ఎన్నికలు నిర్వహించడం ఎంత శ్రమతో కూడుకున్న పనో చెబుతూ వచ్చిన ఈ టీజర్ నిజంగానే ఆకట్టుకుంటోంది.
*దేశంలో జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు రూ.30,000 కోట్లు. 84 కోట్ల ఓటర్లు. 90 లక్షల ఓటింగ్ బూత్‌లు ఉన్నాయి. నేటికీ ఎన్నికల విషయంలో భారతదేశం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. పార్లమెంట్‌కి వెళ్లే గూండాలు ఉండొచ్చు. కానీ అలాంటి గూండాలను మనం ఎన్నికల్లో తలదూర్చనివ్వకూడదు. మనుషులు మారకపోతే దేశం మారదు’ అనే డైలాగ్ తో వచ్చిన ఈ టీజర్ జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమా నేపథ్యం విషయానికి వస్తే... ఎన్నికల ప్రక్రియను సాఫీగా నిర్వహించాలనుకునే ఓ ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో రాజ్‌కుమార్ రావ్ నటిస్తున్నారు.
ఛత్తీస్ ఘడ్ లోని ఓ ప్రాంతానికి ఎన్నికల డ్యూటీ నిమిత్తం న్యూటన్(రాజ్ కుమార్ రావ్)ను పంపిస్తారు. అక్కడ సాఫీగా ఎన్నికలు జరగనివ్వకుండా గూండాలు, రౌడీలు అడ్డుపడుతుంటారు. వీరిందరినీ ఎదుర్కొని తన డ్యూటీని న్యూటన్ ఎలా చేస్తాడు అన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని అమిత్ వి.మసుర్‌కర్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని బెర్లిన్‌లోని 67వ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారు. ఉత్తర అమెరికాలో త్వరలో జరగబోయే ట్రైబెకా ఫిలిం ఫెస్టివల్‌లోనూ ప్రదర్శించనున్నారు.
Full View