ర‌జ‌నీ హైద‌రాబాద్ లోనే ఉంటే పార్టీ ప్ర‌క‌ట‌న ఎలా?

Update: 2020-12-12 05:10 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీని ప్ర‌క‌టించే తేదీ లాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ర‌క‌ర‌కాల డైల‌మాల నుంచి బ‌య‌ట‌ప‌డి ఎట్ట‌కేల‌కు ఫ‌లానా తేదీన ప్ర‌క‌టిస్తాను అంటూ ర‌జ‌నీ ఇటీవ‌ల చెప్పారు. ఈ రోజు తన 70 వ పుట్టినరోజు‌ ప్రత్యేక సందర్భంగా దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ర‌జ‌నీ రాజ‌కీయ పార్టీ గురించి ఆరాలు తీస్తున్నారు.

న‌టుడిగా మ‌రోవైపు ర‌జ‌నీ పూర్తి బిజీ. ఇటీవ‌ల షూటింగు కోసం ప్రిప‌రేష‌న్ లో ఉన్నారాయ‌న‌. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ `అన్నాథే` త‌దుపరి కీల‌క‌ షెడ్యూల్ కోసం ర‌జ‌నీ సిద్ధమవుతున్నాడు. అన్నాథే సుదీర్ఘ (చివరి) షెడ్యూల్ డిసెంబర్ 15 నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమవుతుంది.

అయితే ర‌జ‌నీ షూటింగులో బిజీగా ఉంటే డిసెంబర్ 31 న తన రాజకీయ పార్టీని ప్రారంభించేది ఎలా.. ఎక్క‌డి నుంచి ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేస్తారు? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ర‌జ‌నీ ఆన్ లొకేష‌న్ నుంచే పార్టీ ప‌నుల్ని ప‌ర్య‌వేక్షిస్తున్నార‌‌న్న గుస‌గుస వినిపిస్తోంది. ఫోన్ కాల్స్ ద్వారా తన బృందంతో సమన్వయం చేసుకుని పార్టీకి సంబంధించిన ప్ర‌తిదీ ప‌రిశీలిస్తున్నారు. చెన్నైలో తన బృందంతో దీనిపై క‌స‌ర‌త్తు చేస్తున్నార‌ని స‌మాచారం. సంక్రాంతి పండుగకు స్పెష‌ల్ గా రజినీ పార్టీని ప్రారంభించాలని భావిస్తున్నారు.
Tags:    

Similar News