కొన్ని సినిమాలు యాభై కోట్ల వసూళ్లు సాధించినా హిట్టు అనిపించుకోవు.. కొన్ని సినిమాలు ఐదు కోట్ల వసూలు చేసిన బ్లాక్ బస్టర్ అయిపోతాయి. ఇక్కడ సినిమా మీద ఎంత పెట్టుబడి పెట్టారు.. ఎంత లాభం వచ్చిందన్నదే ముఖ్యం. ఈ కోణంలో చూస్తే దసరాకు వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘రాజు గారి గది’ అని చెప్పాలి.
కేవలం రూ.కోటిన్నర బడ్జెట్లో తెరకెక్కిన సినిమా ఇది. పాజిటివ్ టాక్ తో మొదలైన ఈ సినిమా పెట్టుబడి మీద మూడు రెట్లకు పైగా వసూలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కేవలం తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా పెట్టుబడి రాబట్టేసింది. సినిమాను కొన్నవాళ్లందరూ బ్రేక్ ఈవెన్ వచ్చేశారు. వీకెండ్ తర్వాత వస్తున్నదంతా లాభమే. వీక్ డేస్ లో కూడా సినిమాకు మంచి వసూళ్లు దక్కుతున్నాయి.
దసరాకు పోటీగా వచ్చిన ‘కంచె’ సినిమాకు మంచి టాక్ వచ్చినప్పటికీ అది ఎ క్లాస్ సెంటర్లలో బాగా ఆడుతోంది కానీ.. బి, సి సెంటర్లలో డల్లుగానే ఉన్నాయి కలెక్షన్లు. కొలంబస్ సినిమా ఫ్లాప్ అని తొలి రోజే తేలిపోయింది. రుద్రమదేవి, బ్రూస్ లీ కూడా జోరు తగ్గించేయడంతో మాస్ ఆడియన్స్ కి ‘రాజు గారి గది’ ఫస్ట్ ఛాయిస్ అవుతోంది. మాస్ కామెడీ బాగా వర్కవుట్ కావడంతో మంచి వసూళ్లు దక్కుతున్నాయి ఈ సినిమాకు. ఫుల్ రన్ లో ఈ మూవీ రూ.5 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశముంది.