బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తండ్రి, ప్రముఖ నిర్మాత రాకేశ్ రోషన్ బాలీవుడ్ కే చెందిన ఓ నటుడిపై పరువు నష్టం దావా వేశారు. మోడల్ నుంచి వెండితెర నటుడిగా మారిన సుధాంశు పాండేపై ఆయన తాజాగా రూ.50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఓ సినిమాకు సంబంధించి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ రాకేశ్ రోషన్ ఆయనపై ఈ దావా వేశారు.
తన ఫర్మాయిస్ సినిమా స్క్రిప్టును దొంగిలించి రాకేశ్ రోషన్ - సంజయ్ గుప్తాలు కాబిల్ పేరుతో హృతిక్ రోషన్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలనుకున్నారని సుధాంశు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన ముంబయి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేయడంతో వారు రాకేశ్ రోషన్, సంజయ్ గుప్తాలను విచారించారు. అయితే ... సుధాంశు కావాలనే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని... తాము ఆయన స్క్రిప్టును దొంగిలించలేదని పేర్కొంటూ రాకేశ్ రోషన్ కుటుంబం వాదిస్తోంది. అంతేకాదు, తమకు పరువు నష్టం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారంటూ సుధాంశుపై 50 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అంధేరి మెట్రో పాలిటన్ కోర్టులో జనవరి 14న ఈ మేరకు ఆయన కేసు దాఖలు చేశారు. ఈ విషయంలో తన పేరు అన్యాయంగా లాగారంటూ రాకేశ్ రోషన్ మండిపడుతున్నారు. ఈ బాలీవుడ్ కేసు ఎంతవరకు వెళ్తుందో ఇందులో నిజానిజాలేమిటో తేలాలి మరి.