వెండితెర ఇంద్రాణి... రాఖీసావంత్‌!

Update: 2015-09-09 15:44 GMT
సంచ‌ల‌నం రేకెత్తించిన షీనాబోరా హ‌త్యోదంతం నేప‌థ్యంలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. `ఏక్ క‌హానీ జూలీ కీ` పేరుతో ఆ చిత్రం రూపొంద‌బోతోంది.  కేసులో ప్ర‌ధాన నిందితురాలుగా ఉన్న ఇంద్రాణి ముఖ‌ర్జీ పాత్ర‌లో ఐటెం బాంబ్ రాఖీసావంత్ న‌టిస్తోంది. క‌న్న‌త‌ల్లి అయిన ఇంద్రాణి స్వ‌యంగా త‌న కూతురు షీనాని హ‌త్య చేయించింది. దీంతో ఈ హ‌త్య దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేకెత్తించింది.  ఆ కేసులో బోలెడ‌న్ని చిక్కుముడులు, మ‌లుపులున్నాయి. అవ‌న్నీ ఓ క్రైమ్ థ్రిల్ల‌ర్ సినిమాని త‌ల‌ద‌న్నేలా ఉన్నాయి.  ఈ ఉదంతంలో స‌భ్య‌స‌మాజం త‌ల‌దించుకొనేలా కొన్ని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకొన్నాయి. వాటిని చూసి పోలీసులే విస్తుపోతున్నారు. చాలా హ‌త్య కేసులు చూశాం కానీ... ఇలాంటి కేసులు ఎప్పుడూ చూడ‌లేద‌ని అధికారులు అంటున్నారు. అందుకే ఆ ఉదంతం చిత్ర‌సీమ‌ని బాగా ఆక‌ట్టుకుంది.

ప్ర‌స్తుతం తెర‌కెక్కుతున్న రాఖీసావంత్ సినిమానే కాదు.. భ‌విష్య‌త్తులో ఇంద్రాణి జీవితం గురించి ఇంకా బోలెడ‌న్ని  చిత్రాలొచ్చే అవ‌కాశం ఉంది. రామ్‌ గోపాల్ వ‌ర్మ‌లాంటి ద‌ర్శ‌కులు ఇలాంటి సంఘ‌ట‌న‌లపై చాలా వేగంగా స్పందిస్తుంటారు.  ఆయ‌న సినిమా తీయాల‌నుకోవాలి కానీ... ఏ చిన్న కోణం నుంచైనా తీయ‌గ‌ల‌డు.  మ‌రి తీస్తాడో లేదో చూడాలి. అయితే  రాఖీసావంత్ మాత్రం ఇంద్రాణీ ముఖ‌ర్జీ పాత్రని చేయ‌డానికి తానే క‌రెక్టంటోంది.  హ‌త్య‌కి గురైన  షీనాతో పాటు ఈ కేసుతో ముడిప‌డి వున్న ఇంద్రాణి, పీటర్ ముఖర్జీలు రాఖీకి బాగా ప‌రిచ‌య‌మ‌ట‌. ``ఇంద్రాణి గురించి నాకు బాగా తెలుసు. ఆమెలాగా నాకంటే బాగా ఎవరూ నటించలేరు`` అంటోంది రాఖీ.
Tags:    

Similar News