ఇండియాలో ఫ్యాన్స్ బ్యాన్ చేయాలట

Update: 2016-04-05 17:30 GMT
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ ఇప్పుడో కొత్త డిమాండ్ తో ముందుకొచ్చింది. అదే ఇండియా మొత్తం సీలింగ్ ఫ్యాన్స్ బ్యాన్ చేయాలట. ఈ మేరకు దేశ ప్రధాని నరేంద్ర మోడీకి పబ్లిక్ గా ఓ విన్నపం కూడా చేసేసింది రాఖీ సావంత్. ఇంతకీ.. ఈమె ఇలా డిమాండ్ చేయడానికి కారణం ఉంది. రాఖీ వెర్షన్ ప్రకారం ఆ కారణం కరెక్టే అనిపిస్తుంది కూడా.

టీవీ నటి ప్రత్యూష లాంటి వాళ్లు ఆత్యహత్యలు చేసుకోకుండా ఉండాలంటే.. సీలింగ్ ఫ్యాన్స్ నిషేధించాలంటోంది రాఖీ.  అంటే సీలింగ్ ఫ్యాన్స్ లేకపోతే.. ఉరి వేసుకునే అవకాశం ఉండదన్నది రాఖీ లాజిక్. కరెక్టే అని రాఖీకి అనిపించచ్చు కానీ.. మరీ ఇలాంటి డిమాండ్ అంటే కొంచెం కష్టమే కావచ్చు. అయితే.. రాఖీ సావంత్ ఇక్కడితో ఆగిపోలేదు. ప్రత్యూష లవర్ కి కొన్ని క్వశ్చన్స్ తో పాటు, మరికొన్ని హెచ్చరికలు కూడా చేసేసింది.

"నిజంగా ప్రేమించిన వాడే అయితే.. మొబైల్ తీసుకుని ఎఏందుకు పారిపోయాడు.? మా దగ్గర ఓ వీడియో ఉంది. దాన్ని క్రైమ్ బ్రాంచ్ ఇచ్చాక అన్ని నిజాలు బయటకొస్తాయి. ప్రభుత్వం ప్రత్యూష కుటుంబానికి ఐదు కోట్లు సాయం చేసి ఆదుకోవాలి. అందరూ భారతీయ కూతురికి మద్దతునివ్వాలి." అంటూ రాఖీ సావంత్ చేసిన పోస్ట్ కు మిక్సెడ్ రెస్పాన్స్ వస్తోంది.
Tags:    

Similar News