ర‌క్షాబంధ‌న్ ట్రైల‌ర్: న‌లుగురు చెల్లెళ్లకు అన్న `హిట్ల‌ర్` కాదు క‌దా?

Update: 2022-06-22 05:30 GMT
త‌ల్లిదండ్రులు లేని ఇల్లు ఎలా ఉంటుందో తెలిసిందే. అయితే అమ్మా నాన్న లేని లోటు తెలియ‌నివ్వ‌కుండా ఐదుగురు చెల్లెళ్ల‌ను పెంచి పోషించే బాధ్య‌తాయుత‌మైన‌ అన్న‌గా `హిట్ల‌ర్` క‌నిపించాడు. మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా ముత్యాల సుబ్బ‌య్య తెర‌కెక్కించిన సిస్ట‌ర్ సెంటిమెంట్ డ్రామా 1997లో వ‌చ్చి ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలిసిందే. అలాంటి ఫ్యామిలీ డ్రామాల‌తో సినిమాలేవీ ఇటీవ‌ల క‌నిపించ‌డం లేదు.

తాజాగా కిలాడీ అక్ష‌య్ కుమార్ న‌టించిన ర‌క్షాబంధ‌న్ ట్రైల‌ర్ చూడ‌గానే హిట్ల‌ర్ గుర్తుకు వ‌చ్చింది. అయితే ఈ మూవీ టైటిల్ ర‌క్షాబంధ‌న్ కావ‌డంతో సిస్ట‌ర్ సెంటిమెంట్ కామ‌న్ అని భావించాలి. ఇక్క‌డ ఐదుగురి స్థానంలో న‌లుగురు చెల్లెమ్మ‌ల‌కు అన్న‌య్య ఉన్నాడు. అత‌డు ఎంతో బాధ్య‌తాయుతంగా ఆ న‌లుగురిని పెంచి పోషించి వీళ్లంద‌రికీ న‌చ్చిన వాడితో పెళ్లి చేసే బాధ్య‌త‌ను క‌లిగి ఉన్నాడు.

అదే క్ర‌మంలో అత‌డికి ఏజ్ బార్ అయిపోతే  పిల్ల‌నిచ్చేది ఎవ‌రు? త‌న‌ని ప్రేమించిన భూమి ఫెడ్నేక‌ర్ తండ్రి అస‌లే అత‌డికి పిల్ల‌నివ్వ‌న‌ని అంటాడు. మొత్తానికి డ్రామా అంతా చూస్తుంటే హిట్ల‌ర్ కి పోలిక క‌నిపిస్తోంది. కాక‌పోతే చిరు హిట్ల‌ర్ లో బోలెడంత రంజైన మ‌సాలా క‌నిపిస్తుంది.

కానీ అక్కీ సినిమా ఎంతో క్లాసీగా క‌నిపిస్తోంది. ఉత్త‌రాది టోన్ తో అక్క‌డి క‌ల్చ‌ర్ ని మేళ‌వించి ఈ సినిమాని తెర‌కెక్కించారు ఆనంద్ ఎల్.రాయ్. అయితే ట్రైల‌ర్ ఆద్యంతం ఎంతో ప్లెజెంట్ లుక్ తో ఆక‌ట్టుకుంటోంది.

పెద‌వుల‌పై స‌న్న‌ని స్మైల్ కూడా ప్ర‌తి ఒక్క‌రికీ అనుభ‌వ‌మ‌య్యేలా ఈ ట్రైల‌ర్ ని రూపొందించారు. ట్రైల‌ర్ ఆద్యంతం రంగుల మ‌యంగా ప్లెజెంట్ గా ఆక‌ట్టుకుంటోంది. మంచి ఫీల్ గుడ్ మూవీ ఇద‌ని అర్థ‌మ‌వుతోంది. అక్ష‌య్ ఆ  పాత్ర‌లో ఒదిగిపోయి న‌టించాడు. ఈసారి హిట్టు వైబ్స్ క‌నిపిస్తున్నాయి. అయితే న‌లుగురు చెల్లెళ్లకు అన్న క‌థ ఎక్క‌డో చూసిన‌ట్టుందే! అంటూ తెలుగు ఆడియెన్ వ‌ర‌కూ ఈ ట్రైల‌ర్ ని గెస్ చేస్తారు.

గ‌త కొంత‌కాలంగా బాలీవుడ్ టైమ్ బాలేదు. వ‌రుస హిట్ల మీద ఉన్న అక్ష‌య్ కి కూడా కాలం క‌లిసి రావ‌డం లేదు. అత‌డు న‌టించిన సినిమా బావున్నా జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం లేదు. ర‌న్ వే 34 ఫ్లాప్ అయ్యాక అక్ష‌య్ నుంచి ర‌క్షా బంధ‌న్ వ‌స్తోంది. ఈ మూవీ పై చాలానే ఆశ‌లు ఉన్నాయి. మ‌రి ఈ క్లాసీ మూవీ థియేట‌ర్ల‌లో ఏమేర‌కు మెప్పిస్తుందో చూడాలి.


Full View
Tags:    

Similar News