మా సినిమా బాగానే ఉంది.. థియేటర్లలో ఏదో సమస్య : రకుల్‌

Update: 2022-06-17 05:32 GMT
టాలీవుడ్ లో స్టార్‌ హీరోయిన్‌ గా మూడు నాలుగు సంవత్సరాలు వెలుగు వెలిగిన రకుల్‌ ప్రీత్ సింగ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుసగా సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. రాబోయే సంవత్సర కాలంలో ఈ అమ్మడి నుంచి ఏకంగా పది హిందీ సినిమాలు రాబోతున్నాయి. ఎంట్రీ ఇవ్వడంతోనే ఇంతటి భారీ ఆఫర్లను వరుసగా దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.

కమిట్ అయిన సినిమాల్లో కొన్ని సూపర్‌ హిట్‌ అయినా కూడా ఖచ్చితంగా రకుల్‌ ప్రీత్‌ సింగ్ బాలీవుడ్‌ లో టాప్‌ స్టార్ హీరోయిన్‌ గా మారిపోయేది. కాని ఈమధ్య కాలంలో ఈ అమ్మడు నటించి విడుదల అయిన సినిమాలు హిందీ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. మరీ దారుణంగా డిజాస్టర్ గా కూడా కొన్ని సినిమాలు నిలిచాయి. కలెక్షన్స్ విషయంలో రకుల్‌ నటించిన సినిమా లు మరీ దారుణమైన రికార్డులను నమోదు చేయడం జరిగింది.

ఈ విషయమై రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ను ప్రశ్నించగా ఆమె నుండి ఇంట్రెస్టింగ్ సమాధానం వచ్చింది. సినిమాలు బాగానే ఉంటున్నాయి.. ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తుంది లేదా పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తుంది.

అయినా కూడా వసూళ్లు నమోదు కాకపోవడం చాలా విడ్డూరంగా ఉందని.. థియేటర్ల నుండి రావాల్సిన వసూళ్ల విషయంలోనే అసలు సమస్య నెలకొంది అన్నట్లుగా రకుల్‌ చెప్పుకొచ్చింది.

తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన రన్‌ వే 34 సినిమా ఇటీవలే విడుదల అయ్యింది. ఆ సినిమాకు చాలా మంది పాజిటివ్ గా రివ్యూలు ఇచ్చారట. జనాలు చాలా మంది బాగుందనే అన్నారట. కాని కలెక్షన్స్ మాత్రం రాలేదు అంటూ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో మాదిరిగా థియేటర్లకు జనాలు రావడం లేదని.. అది కరోనా వల్ల అయ్యి ఉండవచ్చు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ చెప్పిన విషయం లో కొంత మేరకు నిజం ఉంది. సినిమా చాలా బాగుంది అనే టాక్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కాని గతంలో మాదిరిగా పర్వాలేదు.. ఒకసారి చూడవచ్చు అనే టాక్ వచ్చిన సినిమాలను జనాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి ఇతర విషయాల కారణంగా థియేటర్ల వద్ద క్యూ లైన్స్ గతంలో మాదిరిగా కనిపించడం లేదు. రకుల్‌ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది.
Tags:    

Similar News