టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ హీరోయిన్ గా దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించిన విషయం తెల్సిందే. అయితే అతి తక్కువ సమయంలోనే ఆమె టాలీవుడ్ లో ఫేడ్ ఔట్ అయ్యింది. ఒకప్పుడు బిజీగా ఉండి మహేష్ బాబు సినిమాకు కూడా డేట్లు ఇవ్వలేక పోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత రెండు మూడు ఏళ్లలోనే తెలుగు లో ఆఫర్లు లేకుండా పోయాయి. తెలుగు మరియు తమిళంలో ఒకే సారి డల్ అవ్వడంతో ఈ అమ్మడు తెలివిగా బాలీవుడ్ కు చెక్కేసింది.
బాలీవుడ్ లో ఈ అమ్మడు ఎంట్రీ ఎంట్రీతోనే ఏకంగా అరడజను సినిమాల ఆఫర్లను దక్కించుకుంది. కరోనా వల్ల కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని వాయిదా పడుతూ వచ్చాయి.. మరి కొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. మొత్తానికి ఈ 2022 సంవత్సరంలో ఆమె నుండి ఏకంగా ఆరు ఏడు హిందీ సినిమాలు వస్తాయని అధికారికంగానే ప్రకటన వచ్చింది. ఆ సినిమాలు మెల్ల మెల్లగా వస్తున్నాయి.
ఇటీవలే జాన్ అబ్రహంతో నటించిన ఎటాక్ సినిమా విడుదల అయ్యింది. ఆ సినిమా పై ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. కాని ఆ సినిమా విడుదల అయ్యిన తర్వాత సందడి కనిపించలేదు.
ఎటాక్ నిరాశ పర్చడంతో ఆ తర్వాత సినిమాలపై ఫోకస్ పెట్టింది. కాని పరిస్థితి చూస్తుంటే బాలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన ఏ ఒక్క సినిమా కూడా ఈమెకు అక్కడ స్టార్ డమ్ తెచ్చి పెడతాయనే నమ్మకం కలగడం లేదు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాల్లో కూడా నటించిన ఈ అమ్మడు ఎక్కువగా కమర్షియల్ పాత్రల్లో కనిపించింది. కనుక సినిమాలు సక్సెస్ అయినా ఈమె పాత్ర అక్కడి ప్రేక్షకుల్లో నోటెడ్ అయ్యేంతగా గుర్తింపు వస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కారణంగానే బాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ గా ఎదగాలనే కల నెరవేరడం కాస్త కష్టమే అయ్యే అవకాశం ఉందని మీడియా వర్గాల వారు చర్చించుకుంటున్నారు. ఆమె బాలీవుడ్ లో సందడి మూడు నాళ్ల ముచ్చటగానే మారే అవకాశాలు ఉన్నాయి అనేది మరి కొందరి అభిప్రాయం. అక్కడ ఆఫర్లు రాకుంటే మళ్లీ సౌత్ లో ఈ అమ్మడు రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. అప్పుడు మరి మన టాలీవుడ్ వారు ఈమెను ఆధరిస్తారా అనేది చూడాలి.