పాన్ ఇండియా కొత్తేం కాదు.. రకుల్‌ ఇంట్రెస్టిగ్ కామెంట్స్‌

Update: 2022-05-28 02:30 GMT
ఈమద్య కాలంలో సౌత్‌ సినిమా ఇండస్ట్రీల్లో ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమలో పాన్ ఇండియా సినిమా అంటూ తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. కొందరు పాన్ ఇండియా సినిమా ల విధానంను తప్పుబడుతుంటే.. మరి కొందరు మాత్రం పాన్ ఇండియా కాదు ఇండియన్ సినిమా అనాలంటున్నారు. తాజాగా రకుల్ ప్రీత్‌ సింగ్‌ స్పందిస్తూ పాన్ ఇండియా సినిమాల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పాన్ ఇండియా సినిమాలు.. ఇండియన్ సినిమాలు అంటూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాని చాలా సంవత్సరాల నుండే సౌత్‌ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు హిందీలో డబ్బింగ్‌ అయితే చూశారు.. టీవీల్లో సౌత్‌ సినిమాలు సూపర్‌ హిట్‌ అయ్యాయి. చాలా ఏళ్ల నుండే తెలుగు తమిళ సినిమాలను మరియు హీరోలను హిందీ ప్రేక్షకులు ఆధరిస్తు అభిమానిస్తున్నారు అంది.

ఇప్పుడు థియేట్రికల్‌ రిలీజ్ అవుతున్న డబ్బింగ్‌ సినిమాలు కూడా ఉత్తరాదిన మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల సౌత్‌ హీరోలు మరింతగా నార్త్‌ లో పాపులారిటీని దక్కించుకుంటున్నారు అంటూ రకుల్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

ప్రతి సినిమా కూడా దేశం మొత్తం విడుదల అవ్వడం.. స్థానిక భాషల్లో విడుదల అవ్వడం వల్ల విజయాన్ని సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా ఎక్కువ శాతం మందికి చేరువ అవుతుందని రకుల్‌ అభిప్రాయం వ్యక్తం చేసింది.

సినిమా అంటే ఏదో ఒక భాషకు చెందినది కాదు.. భాషతో సంబంధం లేకుండా సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. సినిమాలు ఎమోషన్‌ తో సక్సెస్ అవుతున్నాయి. సినిమా అంటే ఒక భాష కాదు ఎమోషన్‌ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అక్కడ సినిమాలు ఇక్కడ.. ఇక్కడ సినిమాలు అక్కడ సక్సెస్ అవ్వడం అనేది శుభపరిణామం. కనుక పాన్ ఇండియా.. ఇంకేదో అంటూ వివాదాలు సృష్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చింది.

ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్ సినీ కెరీర్‌ గురించి మాట్లాడితే... ఈమద్య కాలంలో సౌత్‌ కు పూర్తిగా దూరం అయ్యింది. బాలీవుడ్‌ లోనే లెక్కకు మించిన సినిమాలు చేసింది.. ఇంకా చేస్తూనే ఉంది. రాబోయే ఏడాది కాలంలో అరడజను సినిమాలకు పైగా నే రకుల్‌ నటించినవి బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్దకు రాబోతున్నాయి. సౌత్‌ లో ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తానంటూ అక్కడ ఇక్కడ బిజీ అవ్వాలని కోరుకుంటున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.
Tags:    

Similar News