ముద్దుగుమ్మకు మళ్లీ సౌత్‌ లో ఛాన్స్ దక్కింది

Update: 2022-04-14 05:35 GMT
టాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ సినీ ప్రేమికులకు రకుల్‌ ప్రీత్‌ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ముఖ్యంగా టాలీవుడ్‌ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలు అందరికి కూడా ఈ అమ్మడు జోడీగా నటించి మెప్పించింది. హీరోయిన్ గా ఈ అమ్మడు సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే వరుసగా వచ్చిన ఆఫర్లను కాదనకుండా చేయడం వల్లనో లేదంటే అదృష్టం కలిసి రాలేదో కాని టాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గాయి.

టాలీవుడ్‌ లో ఆఫర్లు తగ్గినా కూడా ఏమాత్రం క్రుంగి పోకుండా బాలీవుడ్‌ లో ప్రయత్నాలు చేసింది. బాలీవుడ్‌ లో అనూహ్యంగా ఈఅమ్మడు ఏకంగా అరడజను సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అందులో మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి. పూర్తిగా బాలీవుడ్‌ కు పరిమితం అవ్వడంతో సౌత్‌ లో సినీ ఆఫర్లు ఈ అమ్మడికి మరింతగా తగ్గాయి. దాదాపుగా రెండున్న మూడు సంవత్సరాలుగా తెలుగు లో మరియు తమిళంలో ఆఫర్లు కనుమరుగయ్యాయి.

సౌత్‌ ఇండియన్ సినిమాల్లో మళ్లీ రకుల్‌ కనిపిస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న సమయంలో అనూహ్యంగా కోలీవుడ్‌ లో ఒక సూపర్ హిట్‌ కాంబో సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. అజిత్ మరియు వినోద్‌ ల కాంబోలో ఇటీవలే వాలిమై సినిమా వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత మళ్లీ వారి కాంబోలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

వాలిమై సినిమాను నిర్మించిన బోనీ కపూర్‌ మళ్లీ వారిద్దరి కాంబో సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ కొత్త సినిమాలో హీరోయిన్ గా రకుల్‌ ప్రీత్‌ సింగ్ ను ఎంపిక చేశారనే వార్తలు జోరుగా వస్తున్నాయి. ఆమె షూటింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉందట.

హీరోయిన్‌ గా ఆమె వరుసగా సినిమాలు బాలీవుడ్‌ లో చేస్తుండగా తెలుగు లో మాత్రం ఆఫర్లు రావడం లేదు. కాని అజిత్‌ నుండి ఆఫర్‌ రావడం తో ఖచ్చితంగా మళ్లీ సౌత్‌ లో ఈమె బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వేళ అజిత్‌ తో చేయబోతున్న సినిమా కనుక సక్సెస్ అయితే కచ్చితంగా భారీ తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు
Tags:    

Similar News