రకుల్ ప్రీత్ బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన హిందీ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. జంగ్లీ పిక్చర్స్ చిత్రం `డాక్టర్ జి`లో తన పాత్ర కోసం డాక్టర్ కోటు వేసుకునే ముందు రకుల్ ప్రీత్ సింగ్ తీవ్రమైన ప్రిపరేషన్ మోడ్ లోకి వెళ్లారట. ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా - షెఫాలీ షా లతో కీలక సన్నివేశాల్లో రకుల్ కనిపిస్తుంది. డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ కనిపించనుంది. అనుభూతి కశ్యప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
ఈ క్యాంపస్ కామెడీ-డ్రామా కోసం రకుల్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స గదిలో వైద్య పరిభాష.. సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవలసి వచ్చింది.
రచనా దశ నుండే దర్శకుడు వైద్య వృత్తిలో ప్రామాణికమైన చిత్రణపై ఆసక్తిని కలిగి ఉన్నారు. వైద్య నిపుణులుగా వారు ఎదుర్కొనే సవాళ్లను తెలుసుకుని నటించాలని కోరారు ఆయన. ఆస్పత్రి లొకేషన్లలో నటీనటులు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకున్నారు. ఈ సినిమాలో వైద్య ప్రపంచాన్ని ప్రామాణికంగా కనిపించేలా చేయడానికి వారి సన్నాహాల్లో భాగంగా చిత్ర బృందం నటీనటులతో ప్రత్యేక శిక్షణా సెషన్ లు నిర్వహించింది.
రకుల్ డాక్టర్ వృత్తిలో నిపుణులతో ఇంటరాక్ట్ కావడం వల్ల తనకు వృత్తి పరమైన డిమాండ్ల గురించి లోతైన అవగాహన వచ్చిందట. “డాక్టర్ జి కోసం షూటింగ్ చేయడం ఒక ఆసక్తికరమైన అనుభవం. నేను డాక్టర్ గా నటిస్తున్నందున నా వ్యవహారశైలి ఖచ్చితంగా ఉండాలి. తెరపై నిజమైన డాక్టర్ లా కనిపించేలా చేయడానికి వైద్య ప్రపంచానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను నేర్చుకోవడం తప్పనిసరి. ఫాతిమాగా మారే ప్రయాణం అద్భుతమైన ప్రక్రియ. దీనిని నేను ఎప్పటికీ ఎంతో ఆనందిస్తాను`` అని తెలిపింది.
తెరపై డాక్టర్ జీ అందంగా కనిపించడానికి రకరకాల పరీక్షలు చేసాము. ఫాతిమా డాక్టర్ గా కనిపించేలా సాధ్యమైనంత జాగ్రత్త పడ్డాం. కేవలం డాక్టరు కోటు ధరించడం ద్వారా డాక్టర్ గా కనిపించలేరు. కేవలం పాత్రను పోషిస్తున్నా.. మీకు బాధ్యత భావం కలుగుతుంది. సినిమాలో సన్నివేశాల కోసం రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు వైద్యులు వారి భుజాలపై ఎంత బాధ్యత కలిగి ఉంటారో వారి జీవితం ఎంత కష్టంగా ఉంటుందో నిజంగా అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రానికి అనుభూతి- సుమిత్ సక్సేనా- విశాల్ వాగ్ -సౌరభ్ భరత్ సహ రచయితలు. ఇటీవల ప్రయాగరాజ్‌లో విస్తృత షెడ్యూల్ ను ముగించారు. ఈ నెలాఖరులోగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.