హీరో రానా దగ్గుబాటి.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లకు ఒకేసారి మతిపోయింది. ఎందుకో? ఈ ఇద్దరూ కలసి ఏ సినిమాలనో కలసి నటించట్లేదు.. అలాగే వీరు చేస్తున్న సినిమాలు మరీ మతిపోగొట్టేశే అంత శారీరక శ్రమను కలగజేయట్లేదు. అలాంటప్పుడు ఎందుకు వీరి మతిపోయింది బాబులూ? పదండి చూద్దాం.
నిజానికి ఇప్పుడు టాలీవుడ్ అంతా ఒక సినిమా చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు. ఉవ్విళ్ళూరుతున్నారు. క్యూలు కడుతున్నారు. అదే 'బాజీరావ్ మస్తానీ'. ఈ సినిమా ఫస్టాఫ్ చూసిన రానా.. ''మన తరానికి చెందిన గ్రేటెస్టు యాక్టర్లు.. రణవీర్ సింగ్ - ప్రియాంక చోప్రా - దీపికా పదుకొనె సినిమాను చూస్తున్నా.. అద్భుతం ఈ బాజీరావ్ మస్తానీ'' అంటూ ట్వీటేశాడు. సేమ్ టు సేమ్.. రకుల్ ప్రీత్ సింగ్ కూడా అంతే. ''వామ్మో దీపిక. వాటే టాలెంట్.. ఉతికి ఆరేసింది. బాజీరావ్ మస్తానీ అదిరిపోయింది'' అంటూ చెప్పుకొచ్చింది. మూడు రోజుల్లో రెండుసార్లు ఈ సినిమాను చూసిందట.
ఇకపోతే టాలీవుడ్ లో చాలామంది ఈ సినిమాను చూశారు. బాహుబలి రేంజ్ సెట్స్ - విజువల్ ఎఫెక్ట్స్ లేకపోయినా.. ఎమోషన్ విషయంలో మాత్రం సంజయ్ లీలా భన్సాలీ.. కాస్త సాగదీసినా కూడా పిండేశాడు. అందుకే మనోళ్ళకు ఈ సినిమా ఎక్కడో గుచ్చుకుంటున్నట్లుంది.