బాలీ కలలు తీరక బ్యాగులు సర్దేస్తున్నారు

Update: 2018-04-18 05:24 GMT
టాలీవుడ్ హీరోయిన్లు బాలీవుడ్ లో వెలిగిపోయేందుకు కలలు కనడం కొత్తేమీ కాదు. అందాల తారగా దేశం మొత్తంతో పిలిపించుకున్న శ్రీదేవి తర్వాత.. ఈ ట్రెండ్ బాగా ఎక్కువైంది. అయితే ఆ తర్వాత ఎవరూ ఆ స్థాయికి కాదు కదా.. కనీసం చెప్పుకోదగ్గ రీతిలో కూడా రాణించడం కష్టమైపోతోంది.

టాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ గా ఛాన్సులు వెలగబెడుతున్న సమయంలోనే.. ఆశిన్.. ఇలియానా వంటి హీరోయిన్లు బాలీవుడ్ కి వెళ్లారు. ఆశిన్ ఎంట్రీ బాగున్నా.. తర్వాత దక్కిందేమీ లేదు. ఇక్కడ టాప్ స్టార్స్ తో భారీ సినిమాలు చేసే ఇలియానా.. అక్కడ చిన్నపాటి సినిమాలతో మనకు అంతగా పేరు తెలియని హీరోలతో మూవీస్ చేయాల్సొచ్చింది. ఇప్పుడీ జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్.. రెజీనాలు కూడా చేరిపోయారు. రకుల్ చేసిన అయ్యారే మూవీతో ఒరిగిందేమీ లేదు. రెజీనా గట్టిగానే ప్రయత్నస్తోంది. ఇప్పటికే తమన్నా కూడా హిందీలో ట్రయల్ వేసొచ్చింది.

అక్కడ అంతగా సాధించేదేమీ ఉండదన్న విషయాన్ని గ్రహించిన పలువురు హీరోయిన్స్ ఇప్పుడు మళ్లీ బ్యాగులు సర్దుకుని టాలీవుడ్ వచ్చేస్తున్నారు. రకుల్ ప్రీత్ తెలుగు మీదే ఫుల్లుగా ఫోకస్ పెట్టింది. మిల్కీ బ్యూటీ కూడా ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మెగా మూవీ సైరాలో ఛాన్స్ దక్కించుకుంది. శృతి హాసన్ కూడా బాలీవుడ్ కలలు అన్నీ పక్కన పెట్టి.. మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం గట్టి ట్రయల్స్ వేస్తోంది. ఇలా బాలీవుడ్ వెళ్లిన వారిలో ఒక్క తాప్సీ పరిస్థితి మాత్రమే కాస్త బెటర్.
Tags:    

Similar News