ఆ ముగ్గురితో రెండోసారి అంటున్న రకుల్

Update: 2016-11-26 05:18 GMT
''త‌మిళంలో 'ధృవ' సినిమా ఒరిజినల్ చూసి ఇష్ట‌ప‌డ్డాను. తెలుగు రీమేక్‌లో న‌న్ను న‌టించ‌మ‌ని అడ‌గ్గానే చేయ‌డానికి ఒప్పుకున్నాను. మంచి సినిమాలో భాగ‌మైనంద‌కు ఆనందంగా ఉంది'' అంటోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. నిన్న సాయంత్రం జరిగిన ''ధృవ'' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో అమ్మడు తన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.. అలాగే దర్శకుడు సురేందర్ రెడ్డితో కలసి హాజరైంది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఇప్పటివరకు కెరియర్ లో రెండోసారి స్టార్ హీరోలతో చేసే రేంజుకు ఇంతవరకు నోచుకోలేదు రకుల్. మొట్టమొదటసారిగా ఇప్పుడు రామ్ చరణ్‌ తో రెండో సినిమా చేస్తోంది. మనోడితో గతంలో ''బ్రూస్ లీ'' అనే డిజాష్టర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇంకో విశేషం ఏంటంటే.. ఈ నిర్మాత అండ్ డైరక్టర్ తో కూడా అమ్మడికి ఇది రెండో సినిమాయే. గతంలో సురేందర్ రెడ్డి డైరక్షన్లో ''కిక్ 2'' సినిమా చేసింది రకుల్. డైరక్టర్ మీద నమ్మకంతో ఏకంగా ఆ సినిమా హీరోకు లిప్ లాక్ కూడా ఇచ్చింది. కాని రిజల్టే.. హార్ట్ ఎటాక్ తెప్పించింది. ఇక ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో మాత్రం.. కెరియర్ బెస్ట్ హిట్ కొట్టింది రకుల్. అవును.. వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన ''సరైనోడు'' ఏ రేంజులో హిట్టయ్యిందో వేరే చెప్పక్కర్లేదుగా.

ఏదేమైనా కూడా ఈ సినిమాతో ఏకంగా హీరో, డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ తో రెండోసారి నటించడం అంటే రకుల్ కు చాలా ఆనందంగా స్పెషల్ గా ఉందట. మరి సినిమా కూడా హిట్టయితే ఆ ఆనందం ఖచ్చితంగా డబుల్ అవుతుందిలే.
Tags:    

Similar News