ఆ అనుభవం ఏకంగా క‌న్నీళ్లే పెట్టించింద‌ట‌

Update: 2021-08-27 08:30 GMT
థియేట‌ర్లో సినిమా చూడ‌టం అనేది ప్రేక్ష‌కుల‌కు ఇప్పుడు కొత్త అనుభూతినిస్తోంది. ఏడాదిన్న‌ర గా ప్రేక్ష‌కులంతా ఓటీటీల‌కే అల‌వాటు ప‌డిపోయారు. మ‌హ‌మ్మారీ రంగ ప్ర‌వేశంతో థియేట‌ర్ల‌కు వెళ్లే సాహ‌సం ఎవ‌రూ చేయ‌డం లేదు. సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ దాదాపు ఓటీటీ లోనే స‌మ‌యాన్ని గ‌డుపుతున్నారు. తాజాగా థియేట‌ర్ లో సినిమా చూసిన అనుభూతిని ర‌కుల్ ప్రీత్ సింగ్ అభిమానుల‌తో షేర్ చేసుకుంది.

ఇటీవ‌లే అక్ష‌య్ కుమార్ న‌టించిన `బెల్ బాట‌మ్` చిత్రం థియేట‌ర్లో రిలీజ్ అయిన సంగ‌తి  తెలిసిందే. ఏ హీరో త‌మ సినిమాల్ని థియేట‌ర్లో రిలీజ్ చేసే దైర్యం చేయ‌కపోయినా కిలాడీ మాత్రం డేరింగ్ చేసి థియేట‌ర్ లోకి వ‌చ్చేసారు. ఫ‌లితం గురించి ప‌క్క‌నబెడితే బెల్ బాట‌మ్ థియేట‌ర్లోకి రావ‌డంతో మిగ‌తా సినిమా లు రిలీజ్ చేయాలా? వ‌ద్దా? అన్న దానిపై బెల్ బాట‌మ్ ఓ క్లారిటీని ఇచ్చిన‌ట్లు అయింది.

అయితే ఈ సినిమా చూడ‌టానికి ర‌కుల్ త‌న ఫ్యామిలీ..స్నేహితుల‌తో క‌లిసి థియేట‌ర్ కి వెళ్లింది. చాలా గ్యాప్ త‌ర్వాత ఇలా థియేట‌ర్లో సినిమా చూడ‌టం చాలా అనందంగా ఉంద‌ని ఆనంద‌బాష్పాలు కురిపించింది. మ‌ళ్లీ పాత రోజులు రావాల‌ని.. అంద‌రి హీరోల సినిమాలు థియేట‌ర్లో ప్రేక్ష‌కుల సంద‌డి న‌డుమ హౌస్ ఫుల్స్ తో న‌డ‌వాల‌ని ఆకాంక్షించింది. ఏడాది త‌ర్వాత థియేట‌ర్లో కాలు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంద‌ని.. కొత్త అనుభూతినిని క‌లిగించింద‌ని ర‌కుల్ వెల్ల‌డించింది. బెల్ బాట‌మ్ చిత్రాన్ని థియేట‌ర్లో  రిలీజ్ చేసినంద‌కు అక్ష‌య్ కుమార్ కి నిర్మాత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసింది.

రెండ‌వ వేవ్ స‌మ‌యంలో థియేట‌ర్లోకి వ‌చ్చిన మొట్ట మొద‌టి బాలీవుడ్  సినిమా ఇదేన‌న్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో అయితే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ అవ‌న్నీ లో బ‌డ్జెట్ చిత్రాలు. అగ్ర హీరోల చిత్రాలు మాత్రం థియేట్రిక‌ల్ రిలీజ్ కు రాలేదు. శ్రీ విష్ణు న‌టించిన రాజ రాజ చోర థియేట‌ర్లో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నా క‌రోనా థ‌ర్డ్ వేవ్  భ‌యంతో జ‌నాలు థియేట‌ర్ కి వెళ్ల‌లేదు. ప్ర‌స్తుతానికి ఏపీలో థియేట‌ర్లు తెరుచుకున్నా..అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ కు లేక‌పోవ‌డం కూడా ఓ కార‌ణంగా చెప్పొచ్చు.
Tags:    

Similar News