ఆ రూమర్లపై రకుల్ ఫీలవుతోంది

Update: 2016-11-24 19:30 GMT
రెండు రోజుల క్రితం టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారంటూ వార్తలు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలైతే రకుల్ కి ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయని కూడా చెప్పేశాయి. గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లిలో డ్యాన్స్ చేసినందుకు పెద్ద మొత్తం అందుకుందని.. అందుకు సంబంధించిన వివరాలను చెప్పాలని ఐటీ శాఖ ఒత్తిడి చేసిందని రూమర్లు చక్కర్లు కొట్టాయి.

అయితే ఈ పరిణామాలపై రకుల్ ప్రీత్ బాగా ఫీలవుతోంది. 'ఈ టాపిక్ జనాలు ఎందుకు వదిలేయరో అర్ధం కాని విషయం. మొదట నా రెమ్యూనరేషన్ అమౌంట్ ని రెండు రెట్లు చేశారు. తర్వాత 3 రెట్లు చేసి రూమర్స్ పుట్టించారు. ఇప్పుడు ఏకంగా ఐటీ రెయిడ్స్ అంటున్నారు. ఇది చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ రూమర్లపై మా నాన్న చాలా బాధ పడుతున్నారు. అసలు ఎవరూ నన్ను ఈ విషయంపై అడగకుండానే ఇష్టం వచ్చినట్లు రాసేసుకుంటున్నారు' అంటోంది రకుల్ ప్రీత్ సింగ్.

'నేను మీడియాతో ఎప్పుడూ చాలా ఓపెన్ గా ఉంటాను. నా లైఫ్ లో జరిగే అన్నిటినీ దాదాపు మీడియాతో పంచుకుంటున్నాను. మీడియా ఫ్రెండ్లీగా ఉన్నా సరే. తనపై ఇలాంటి రూమర్స్ పుట్టించడం సరికాదు' అన్నది రకుల్ ఉద్దేశ్యం. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కి చెక్ పడతాయా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News