మొన్నటి దాకా టాప్ ఫామ్ లో ఉంటూ ప్రస్తుతం తెలుగులో చేయడం దాదాపుగా మానేసిన రకుల్ ప్రీత్ సింగ్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ కోలీవుడ్ మీదే పెట్టింది. ఈ నెల 14న విడుదల కానున్న కార్తీ దేవ్ తో కెరీర్ ఇంకా స్పీడందుకుంటుందన్న నమ్మకంతో ఉంది. అయితే టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిపోవడం వల్లే రకుల్ అటు షిఫ్ట్ అయ్యిందన్న మాటను పూర్తిగా కొట్టిపారేస్తోంది. అలాంటిదేమి లేదని ఇది అనుకోకుండా వచ్చిన గ్యాప్ తప్ప వేరే కారణం లేదని ఇతర భాషల్లో బిజీగా ఉండటం వల్ల కొన్ని మిస్ అయ్యుండొచ్చేమో కాని తెలుగుకు తన ప్రాధాన్యత ఎప్పుడూ తగ్గదని క్లారిటీ ఇచ్చింది.
అయితే రకుల్ బిజీగా ఉన్న మాట నిజమే. ఇప్పుడు పూర్తి చేసిన దేవ్ తో పాటు కార్తీ అన్నయ్య సూర్య సరసన ఎన్జికెలో కూడా రకుల్ జోడిగా చేసింది. అందులో హీరోయిన్ సాయి పల్లవి కూడా ఉంది. టైటిల్ డిసైడ్ కానీ మరో సినిమాలో శివ కార్తికేయన్ సరసన మరో ఛాన్స్ కొట్టేసింది. ఇది ఫైనల్ స్టేజి షూటింగ్ లో ఉంది. ఇవి కాకుండా హిందీలో మార్జవాన్ కోసం ప్రత్యేకంగా యోగా కసరత్తులు కూడా చేస్తోంది. ఇప్పటికే బాగా సన్నబడ్డ రకుల్ దీని వల్ల ఇంకా తగ్గేలా ఉంది.
మార్జావాన్ లో సిద్దార్థ్ మల్హోత్రాతో జోడి కడుతోంది. ఈ ఇద్దరు గత ఏడాది నీరజ్ పాండే దర్శకత్వంలో ఆయారి చేసారు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అజయ్ దేవగన్ సరసన దే దే ప్యార్ దే తన ఖాతాలోనే ఉంది. వెంకీ మామలో నాగ చైతన్య సరసన మరోసారి ఛాన్స్ కొట్టేసిన రకుల్ గతంలో కొన్ని సినిమాల ఎంపికలో పొరపాటు చేసానని ఈసారి అవి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానని చెబుతోంది. ఎప్పటికి హైదరాబాద్ తన పుట్టినిల్లు లాంటిదని టాలీవుడ్ ని వదిలే ప్రసక్తే లేదని చెబుతోంది.