తెలుగు ప్రేక్షకులకు ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ వైపు తెలుగు సినిమాలు చేస్తూనే మరోవైపు తమిళ, హిందీ సినిమాలు లైన్ లో పెడుతోంది. మొన్న లాక్ డౌన్ వరకు రకుల్ చేతిలో తమిళం, హిందీ బాషలలో ఒక్కో సినిమాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు రకుల్ చేతిలో రెండు తెలుగు సినిమాలు, మూడు హిందీ, రెండు తమిళ సినిమాలతో బిజీగా గడుపుతోంది. 2017లో విడుదలైన జయ జానకి నాయక సినిమా తర్వాత రకుల్ ఒక్క తెలుగు హిట్ కూడా కొట్టలేక పోయింది. లాస్ట్ ఇయర్ నాగార్జున సరసన మన్మధుడు-2 లో రొమాన్స్ చేసింది కానీ ఫలితం లేకుండా పోయింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది. అప్పటి నుండి ఒక్క తెలుగు సినిమా కూడా అమ్మడిని వరించలేదు. ఇక లాక్ డౌన్ ఎండింగ్ లో హైదరాబాదులో అడుగు పెట్టింది. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్రామీణ నేపథ్య సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
అదేగాక నితిన్ సరసన చెక్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుంది. ఇవేగాక హిందీలో ఎటాక్, సర్దార్ అండ్ గ్రాండ్ సన్, మేడే సినిమాలు లైన్ లో పెట్టింది. ఇక తమిళ విషయానికి వస్తే పాన్ ఇండియా మూవీ ఇండియన్-2 తో పాటు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి భామ టైం ఫుల్ స్వింగ్ లో ఉంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. ఇండస్ట్రీలో పెళ్లిళ్ల గోల ఎక్కువైపోయింది. అంతకంటే ఎక్కువ మాల్దీవ్స్ గోల వినిపిస్తుంది. ఇటీవలే రకుల్ మాల్దీవ్స్ కి వేకెషన్ కూడా వెళ్లొచ్చింది. కానీ సింగిల్ గా వెళ్ళింది. అందరు సినీ భామలు పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం మాల్దీవ్స్ కి వెళ్తుంటే రకుల్ మాత్రం ఒంటరిగా వెళ్ళింది. కొన్ని అందమైన ఫోటోషూట్స్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చింది. అయితే రకుల్ కు కావాల్సిన భర్త విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇదివరకే పలు ఇంటర్వ్యూలలో కాబోయేవాడి క్వాలిటీస్ బయట పెట్టింది. అయితే మొత్తానికి రకుల్ హబ్బీ తెలివైనవాడు అయితే చాలంటుంది. చూడాలి మరి ఈ బిజీలో ఏదైనా తీపి కబురు చెబుతుందేమో..!!