తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి బాగానే తెలుసు. ఎందుకంటే తెలుగులో దాదాపు అందరూ హీరోలతో సినిమాలు చేసేసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగుతో పాటు తమిళ, హిందీ సినిమాలు కూడా లైనప్ చేసి పెట్టేసింది. అమ్మడు చేతినిండా సినిమాలతో ఇప్పట్లో ఖాళీ లేకుండా బిజీగా గడుపుతోంది. తెలుగులో రకుల్ జయజానకినాయక సినిమా తర్వాత హిట్టు అందుకోలేదు. కింగ్ నాగ్ తో మన్మధుడు-2 రొమాన్స్ ప్లాప్ అయింది. అలాగే ఈ ఏడాది చెక్ సినిమాలో నటించింది. కానీ చెక్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. ఇప్పటికైతే టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్రామీణ నేపథ్యం కలిగిన మూవీ చేసింది.
ప్రస్తుతం రకుల్ హిట్టు కంపల్సరీ అనే పరిస్థితిలో ఉంది. అందుకే డైరెక్టర్ క్రిష్ సినిమా పై భారీ ఆశలే పెట్టుకుంది. అయితే హిందీలో ఎటాక్, మేడే సినిమాలతో.. తమిళంలో పాన్ ఇండియా మూవీ ఇండియన్-2 తో పాటు టాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ సరసన అయలన్ సినిమాలు చేస్తోంది. మొత్తానికి రకుల్ ప్రీత్ టైం ఫుల్ స్వింగ్ లో ఉందనే అనిపిస్తుంది. అయితే సినిమాల విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం అమ్మడు కరోనా కారణంగా ఇంటి పట్టునే ఉంటోంది. అయితే ఎన్నడూ లేనివిధంగా గతేడాది ఈ ఏడాది గ్యాప్ రావడం - రెస్ట్ తీసుకోవడంతో గ్యాప్ లేకుండా షూటింగ్ చేసే ప్లాన్ చేసుకుంటోంది. అలాగే ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ముగిసి షూటింగ్స్ ప్రారంభం అవుతాయా అని ఆత్రంగా ఉందట.
రకుల్ ఖాళీగా ఉంటే మాత్రం సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఏదొక పోస్ట్ పెట్టి అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంది. అలాగే తాజాగా అమ్మడు గుడ్ హెయిర్ డే అంటూ ఇంస్టాగ్రామ్ లో త్రోబ్యాక్ పిక్ పోస్ట్ చేసింది. రకుల్ అలాగే షూటింగ్ కోసం ఉత్సాహంగా వెయిట్ చేస్తున్నట్లు.. ఇంకా వెయిట్ చేయడం చాలు అన్నట్లుగా కాప్షన్ జోడించింది. రకుల్ హెయిర్ చూస్తే చాలా కూల్ అండ్ సిల్కీగా కనిపిస్తుంది. మరి కింద కాప్షన్ చూస్తే అవును ఎప్పుడెప్పుడు షూటింగ్స్ మొదలవుతాయో అని గుర్తు చేస్తోంది. మొత్తానికి అమ్మడు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా బిజీ ఉండేలా సినిమాలు సెట్ చేసుకుంటోంది. ప్రస్తుతం రకుల్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.