స్టైలిష్ ఫ్లోరల్ డిజైన్ దుస్తులలో పొడుగుకాళ్ల సుందరి..!

Update: 2021-06-15 04:30 GMT
టాలీవుడ్ టు బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీలలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్.. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో రకుల్ తన అందాలతో ఉనికిని చాటుకుంటూనే ఉంటుంది. అదిరే ఫ్యాషన్ లుక్స్ తో సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ ఆ ఫోటోలు వెంటనే ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ మన్మధుడు బ్యూటీని లేతరంగు దుస్తులలో ఆస్వాదించవచ్చు. రకుల్ డ్రెస్ లో కలర్ ఫుల్ ఫ్లోరల్ డిజైన్ ప్రింట్స్ చూడవచ్చు. మొత్తానికి అమ్మడు ఈ మినీ డ్రెస్ లో చాలా యాక్టీవ్ గా కనిపిస్తుంది.

మినీ ఫ్లోరల్ డ్రెస్ లో అమ్మడు కుర్రకారు దృష్టిని ఆకర్షిస్తుంది. అందమైన అలంకరణతో జాలువారే నల్లని లూస్ హెయిర్ తో కెమెరా వైపు హాట్ లుక్కుతో కవ్విస్తుంది. పువ్వులు పొదిగిన దుస్తులలో రకుల్ చాలా అట్రాక్టీవ్ గా రెట్టింపు అందంతో కనిపించడం విశేషం. రకుల్ డ్రెస్ పై ఫ్లోరల్ డిజైన్స్ ఆమె గ్లామర్ లుక్స్ కు అందం తీసుకొచ్చింది. ప్రస్తుతం అమ్మడు పలు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి పొడుగు కాళ్ళ సుందరిలలో రకుల్ కూడా ఒకటి. హీరోయిన్ పాత్రలో రెండేళ్లుగా టాలీవుడ్ తెరపై కనిపించలేదు రకుల్. ఇటీవలే చెక్ అనే సినిమాలో లాయర్ క్యారెక్టర్ పోషించింది.

అయితే ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో అమ్మడికి ఒరిగిందేమి లేదు. అందుకే తమిళంలో హిందీలో పలు సినిమాలను లైనప్ చేసి పెట్టుకుంది. అంతేగాక ఎప్పుడెప్పుడు షూటింగ్స్ మొదలవుతాయా అని ఆత్రంగా వెయిట్ చేస్తోంది. ఇటీవలే రకుల్ నటించిన బాలీవుడ్ మూవీ 'సర్దార్ కా గ్రాండ్సన్' మూవీ డిజిటల్ రిలీజ్ అయింది. ఆ సినిమా నుండి కూడా రకుల్ ప్రీత్ ఎలాంటి విశేషం అందుకోలేదు. ప్రస్తుతం తెలుగులో అమ్మడు నటించిన జంగల్ బుక్(నామమాత్రం టైటిల్) మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రకుల్ గ్లామరస్ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ పై భారీ ఆశలే పెట్టుకుందని సమాచారం. చూడాలి మరి త్వరలో వయ్యారి బాలీవుడ్ స్టార్డం ఆశలు నిజం అవుతాయేమో!
Tags:    

Similar News