మావి మామూలు కష్టాలు కావు-రకుల్‌

Update: 2015-05-24 17:30 GMT
ఆర్మీ ఆఫీసర్‌ కూతుర్ని కదా.. నాకు చిన్నప్పట్నుంచి కష్టమే తెలియదని.. మేమెప్పుడూ సంతోషాల్లోనే బతికామని అనుకుంటే పొరబాటే అంటోంది రకుల్‌. ఆర్మీ వాళ్ల ఫ్యామిలీస్‌లో ఎన్ని ఇబ్బందులుంటాయో మీకేం తెలుసు అంటూ తమ కుటుంబం పడ్డ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది రకుల్‌.

''ఆర్మీ వాతావరణంలో పెరగడంతో చిన్నప్పుడే గన్స్‌, రైఫిల్స్‌ సహా చాలా ఆయుధాల్ని దగ్గరుండి చూశా. ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం తర్వాత నాన్నకు రాజస్థాన్‌లోని ఇండోపాక్‌ బోర్డర్‌ దగ్గర పోస్టింగ్‌ వచ్చింది. అక్కడ యుద్ధం తర్వాత సైనికుల పహరా, ఆయుధాల వినియోగం ఎలా ఉంటుందో దగ్గరుండి చూశా. ఇంత భయంకరమైన వాతావరణంలోనా నాన్న పని చేసేది అని భయమేసేది.

నాన్నకు మిజోరాంలో పోస్టింగ్‌ పడ్డప్పుడూ మా కుటుంబమంతా చాలా ఇబ్బంది పడ్డాం. అక్కడ మా నాన్నతో మాట్లాడాలంటే ఫోన్‌ సదుపాయం కూడా ఉండేది కాదు. ఆయనై ఫోన్‌ చేస్తే మాకు కాల్‌ కలిపేవారు. సెక్యూరిటీ ప్రాబ్లెమ్స్‌ వల్ల మేం చెప్పిన విషయాల్ని మధ్యలో మరో వ్యక్తి నాన్నకు చెప్పేవాళ్లు. అలా మూడేళ్ల పాటు ఎంతో బాధ, ఒత్తిడి అనుభవించాం. మూడేళ్ల తర్వాత ఢిల్లీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక మాకీ ఇబ్బందులు తప్పాయి'' అంటూ తన ఫ్యామిలీ కష్టాల్ని వివరించింది రకుల్‌.

Tags:    

Similar News