టాలీవుడ్ లో హీరోయిన్లు కు సరైన పాత్రలు రాయరు అనే వాదనను నేను ఒప్పుకొను అంటోంది రకుల్ ప్రీత్ సింగ్. ఎందుకంటే మన ముందు సినిమాలు చూసినట్లయితే శ్రీదేవి క్షణక్షణం - జెనీలియా బొమ్మరిల్లు - త్రిష నటించిన నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చాయి కదా అంటూ నవ్వేస్తోందీ అమ్మడు. ఇక ఇప్పుడు కూడా సాయి పల్లవి - నివేతా థామస్ కూడా అటువంటి సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అని చెప్పింది. మరి వారి సక్సెస్ అమ్మడికి ఇన్ సెక్యూరిటీ భావం తెప్పట్లేదా? ఈమె కేవలం అందగత్తె కాని పెద్ద యాక్టర్ కాదు కదా. అలా అంటే రకుల్ ఏమంటోందంటే..
''నాకు వాళ్ళు అలా పేరు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 'నిన్నుకోరి' సినిమా లో నివేతా యాక్టింగ్ చూసి పిచ్చెక్కింది. నాకు కూడా అలాంటి కథలు వస్తే భలే బావుండు అని కూడా అనిపించింది. మొన్ననే లండన్ నుండి వచ్చాను కాబట్టి ఫిదా త్వరలో చూస్తాను. ఇలాంటి వాళ్ళు తెలుగు సినిమాలలో నటించడం వలన మంచి కథలు రాసే అవకాశం ఉంటుంది. నాకు వాళ్ళు ఇప్పుడు గట్టి పోటీ అని అందరూ అంటున్నారు కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే నాకు నా నటన పై ఒక అవగాహన ఉంది. నా బలాలు నాకు తెలుసు. వాళ్ళు ఒకలాంటి నటన చేస్తే నేను మరో విదంగా చేస్తా అంతే. ఎవరి ఆఫర్లు వారికి ఉన్నప్పుడు అసలు అభద్రత అనే ఫీలింగ్ కు తావే లేదు. మొన్న రారండోయ్ సినిమాలో భ్రమరాంభ క్యారెక్టర్ ఇప్పుడు జయ జానకి నాయకలో ఈ రోల్.. నా క్యాలిబర్ ను పూర్తి స్థాయిలో చూపిస్తాయి'' అని సెలవిచ్చింది రకుల్ ప్రీత్.
అయినాసరే కమర్షియల్ హీరోయిన్ గా ఇప్పుడు ఇప్పుడే ఎదుగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు కొంచెం ఇబ్బందే అంటున్నారు సినిమా లవర్స్. ఎందుకంటే చిన్న హీరోయిన్లు అనుకునే సాయి పల్లవి - నివేదా థామస్ - కీర్తి సురేశ్ లాంటి వారు తన నటనతో స్టార్ హీరోయిన్లు కావడానికి అడుగు దూరంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. మరి ఇలాంటి పోటీ ఏర్పడుతున్న సమయంలో రకుల్ తన స్థానాన్ని ఎలా పదిలపరుచుకుంటుందో చూడాలి.